వ్యవసాయానికి రోబో వచ్చేసింది...

26 Sep, 2018 01:21 IST|Sakshi

మూడేళ్ల క్రితం పోర్చుగల్‌లో ఓ రోబోను ప్రపంచానికి పరిచయం చేశారు. ద్రాక్షతోటల్లో పనిచేసేందుకు ఉద్దేశించిన ఈ వైన్‌రోబో దానికి మరిన్ని మెరుగులు దిద్దింది. తాజాగా వైన్‌స్కౌట్‌ పేరుతో మళ్లీ విడుదల చేసింది. అత్యాధునిక లిడార్‌ టెక్నాలజీని ఉపయోగించుకుని వైన్‌స్కౌట్‌ ద్రాక్షపండ్లు ఎంతమేరకు మగ్గాయి? పంటకు ఏమైనా చీడపీడలు ఆశించాయా? అన్న విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూంటుంది.ద్రాక్షతోటల వరుసల్లో తనంతట తాను ప్రయాణించేందుకు, మొక్కలకు ఏమాత్రం హాని కలిగించని రీతిలో ఒక వరుస నుంచి ఇంకోదాంట్లోకి వెళ్లేందుకు ఇందులో కృత్రిమ మేధను ఉపయోగించారు.

అంతేకాకుండా రాత్రివేళల్లోనూ పనిచేయగలగడం దీనికి ఉన్న మరో ప్రత్యేకత.  మొక్కల ఆకుల ఉష్ణోగ్రత, అందులోని నీటి తేమ మోతాదును గుర్తించేందుకు ఇందులో పరారుణ కాంతితో పనిచేసే కెమెరా, మల్టీస్పెక్ట్రల్‌ కెమెరాలు రెండూ ఉంటాయి. ఒక్కో వైన్‌ స్కౌట్‌ గంటకు దాదాపు మూడువేల సమాచారాలను సేకరించగలదు. ఈ సమాచారం మొత్తాన్ని ఒక మ్యాప్‌ రూపంలో అందిస్తుంది కూడా. వైన్‌స్కౌట్‌ బాడీపైనే ఉండే సోలార్‌ప్యానెల్స్‌ ఎప్పటికప్పుడు విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ లిథియం అయాన్‌ బ్యాటరీల్లో నిల్వ చేస్తూంటాయి. 

మరిన్ని వార్తలు