యుద్ధ కచేరి

18 Nov, 2019 00:52 IST|Sakshi
దిగవల్లి వేంకట శివరావు

అలనాటి వ్యాసం

ఐరోపా ఖండమంత పెద్ద దేశం ఇంత సులభంగా ఇంగ్లీషువారి చేతికి ఎలా చిక్కిందని వారికే ఆశ్చర్యంగా వుంటూవుంటుంది. ప్లాసీ యుద్ధభూమి మీద 1757లో క్లైవును ఎదుర్కొన్న సురాజ్‌ ఉద్దౌలా సైనిక శిబిరం ఎలాంటిదో కాస్త తెలుసుకుంటే ఇది సులభంగా అర్థమౌతుందని జాన్‌ లా అనే ఆంగ్లేయుడు 1908లో వ్రాశాడు.

‘‘ఆ కాలంలో దేశీయ రాజులు, నవాబులు యుద్ధానికి తరలి వెళ్లేటప్పుడు వారి సేనలతో వారి పరివారమంతా బయలుదేరేవారు. జనానా స్త్రీలు, బోగమువాళ్లు, దుకాణదార్లు, సంగీత పాటకులు, ఇంకా రకరకాల వాళ్లూ కలిసి, ఆ శిబిరం కదులుతూవున్న ఒక మహాపట్నంలాగ వుండేది. రాత్రింబవళ్లు సంగీత కచేరీలు జరుగుతూ వుండేవి. సైనికులు సర్వసాధారణంగా వుపయోగించే ఆయుధాలు విల్లంబులేగానీ తుపాకులు లేవు. ఉన్న కొద్ది ఫిరంగులూ చాలా బరువుగా వుండి ఉపయోగించడమే కష్టముగా వుండే తాతలనాటివి. పాత సరుకు’’.
దిగవల్లి వేంకట శివరావు ‘కథలు గాథలు’ (5వ భాగము) లోంచి; సౌజన్యం: నవచేతన

మరిన్ని వార్తలు