పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచే ఆహారం

24 Feb, 2016 22:30 IST|Sakshi
పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచే ఆహారం

గోధుమలు, రాగులు, సజ్జలు లాంటి ముడి ధాన్యాలు తీసుకోవడం వల్ల మెదడుకు తగినంత శక్తి గ్లూకోజు ద్వారా సరఫరా అయ్యి మెదడు చురుకుగా పని చేసేలా చేస్తాయి.యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న పళ్లు, కూరగాయల వల్ల జ్ఞానం వృద్ధి చెంది పిల్లల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. విటమిన్-సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.పెరుగులోని మాంసకృత్తులు, మేలు చేసే కొవ్వు, విటమిన్-బి మెదడుకు గ్రాహ్యశక్తిని పెంచుతాయి. చేపలలోని ఒమేగా, విటమిన్-డి మతిమరుపును తగ్గించి గ్రాహ్య శక్తిని పెంచుతుంది. నట్ బటర్ (వెన్న) ఒమెగ-3 ఫ్యాట్స్ మెదడు సరిగా పనిచేయుటకు తోడ్పడును. ఆకుకూరలు పాలకూరలోని విటమిన్స్ మతిమరుపును తగ్గిస్తాయి.
     
ఓట్‌మీల్‌లోని మాంసకృత్తులు, పీచు పదార్థాలు మెదడులోని ధమనులను సరిగా పనిచేసేలా చేసి జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది.మంచి నీరు సరిగా తాగకపోతే డీహైడ్రేషన్‌కు లోనై చదివినవి గుర్తు ఉండక పరీక్షల్లో సరిగ్గా రాణించలేరు.గుమ్మడి గింజలలో ఉన్న జింక్ మెదడుకు పదును పెడుతుంది. ఆపిల్స్ మరియు బాదంలోని కొన్ని పదార్థాలు మెదడులోని నరాలను చురుగ్గా పనిచేసేలా చేస్తాయి.
 
 

మరిన్ని వార్తలు