తల్లిదండ్రుల చేసిన ఘాతుకానికి..ఏకంగా ఆ చిన్నారి 80 ఏళ్లుగా..

12 Oct, 2023 16:15 IST|Sakshi

కొన్ని విచిత్ర సంఘటనలు ఓ పట్టాన అర్థం కావు. అదెలా సాధ్యం అన్నంతగా ఆశ్చర్యం కలిగిస్తాయి. తల్లిదండ్రులు ఓ చిన్నారి పట్ల చేసిన దుశ్చర్య వరంగానే మారి అందర్నీ ఆశ్చర్యపరించింది. వైద్యుల్ని సైతం విస్మయపరిచింది.

రష్యాలోని ఫార్‌ ఈస్ట్‌లో ఉండే ఒక వృద్ధ మహిళ బ్రెయిన్‌కి సీటీ స్కాన్‌ చేశారు వైద్యులు. ఐతే వైద్యులలు ఆమె బ్రెయిన్‌ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇదేలా సాధ్యం. అలాంటి వస్తువుతో ఆమె ఏకంగా 80 ఏళ్లు బతికింది. అదికూడా ఓ ఇనుప వస్తువుతోనా!,, అని ఆశ్చర్యపోయారు. శిశుహత్య చేయాలకున్న తల్లిదండ్రుల విఫలప్రయ‍త్నం ఫలితంగా ఆమెకు ఇలా జరిగిందని తెలిసి కంగుతిన్నారు.

పైగా ఆ టైంలో ఎలాంటి సదుపాయాలు లేవు. కానీ ఆమెకు ఎలాంటి ఇన్ఫెక్షన్‌ కాకుండా ఉండటమే గాదు. పైగా ఇన్నేళ్లు ఆమెకు ఎలాంటి తలనొప్పిగాని తలకు సంబంధించిన ఇబ్బంది గానీ లేకపోవడం విశేషం. రష్య రిమోట్‌ ప్రాంతంలో సఖాలిన్‌లో ఆమె పుట్టినప్పుడు తీవ్ర కరువు ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయం. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను చంపేయాలనుకున్నారు. అందుకోసం తలలో మూడు సెంటీమీటర్ల పొడవుగల సూదిని దింపేస్తారు.

విచిత్రంగా ఆమెకు ఏం కాలేదు. నేరం బయటపడకుండా ఉండేందుకు ఆ కాలంలో శిశువులను ఇలా హతమార్చేవారు. బాల్యంలో ఆ మహిళను చంపేందుకు తల్లిదండ్రులు గుచ్చిన సూది ఆమె బ్రెయిన్‌కి ఎడమ ప్యారిటల్‌ లోబ్‌లోకి చొచ్చుకుపోయింది. అది బాలికపై ఎలాంటి ప్రభావం చూపకపోవడమే గాక ప్రాణాలతో బయటపడింది. ఈ గాయం కారణంగా ఎలాంటి నొప్పి గురించి ఫిర్యాదు చేయలేదని సదరు వృద్ధ మహిళ చెప్పడం విచిత్రం. ఆమెకు ఏం కాకపోవడానికి గల కారణమేమిటి? అది ఇనుము అయినా ఆమెకు ఎలాంటి హాని జరగకపోవడానికి కారణం ఏంటని తెలుసుకునే అన్వేషణలో ఉన్నారు వైద్యులు.

(చదవండి: అంత్యక్రియలు ఆ కాలంలో అలా ఉండేవా..ప్రజలే తినేసేవారా..!)

మరిన్ని వార్తలు