పాదాలకు కొత్త అందాలు...

21 Apr, 2016 22:53 IST|Sakshi
పాదాలకు కొత్త అందాలు...

 న్యూలుక్

డ్రెస్ డిజైన్‌లో సొంత ప్రయోగాలు చేస్తాం. అదే పాదాలకు ధరించే చెప్పుల గురించైతే ఆలోచించడానికేమీ ఉండదు. షాప్‌కెళ్లి నచ్చినవి పట్టుకొచ్చేస్తాం. అలా కాకుండా ఎండాకాలం ఈ వేడి వాతావరణానికి తగ్గట్టు మన పాదరక్షలను మనమే డిజైన్ చేసుకుంటే ... అదెలాగో చూద్దాం..

 

ఇప్పటికే మీ వద్ద ఉన్న చెప్పుల జతలను బయటకు తీయండి. అందులో ఉపయోగంలో ఉన్నవీ, లేనివీ వేరు చేయండి. పాతబడిన, అంతగా ఉపయోగించని వాటిని తీసుకొని కొత్తగా ఈ విధంగా ప్రయోగించవచ్చు.రంగురంగుల కాటన్, సిల్క్ క్లాతలను తీసుకోవాలి. ఇందుకోసం మళ్లీ క్లాత్ కొనక్కర్లేదు. ఉపయోగంలో లేని డ్రెస్సులు, దుపట్టాలను ఇందుకు వాడచ్చు. జనపనార మెత్తటి తాళ్లను కూడా వాడచ్చు.

      
క్లాత్ ముక్కలను పొడవైన పీలికలుగా కత్తిరించాలి. వీటిని జడలుగా అల్లి పక్కనుంచాలి. చెప్పు పైభాగంలో ఉండే నాడలను తొలగించాలి. ఈ నాడల ప్లేస్‌లో అదే విధంగా అల్లిన ఫ్యాబ్రిక్ జడలను సెట్ చేయాలి. చెప్పు నాడలు ఎలాంటి సమస్య లేకుం డా ఉంటే వాటికే మల్టీకలర్ ఫ్యాబ్రిక్‌తో పువ్వులను చేసి, కుట్టాలి. అప్పుడు స్లిపర్స్ కూడా స్టైల్ ఫుట్‌వేర్‌గా మారిపోతాయి.   రకరకాల మోడల్స్‌లో క్లాత్స్, రిబ్బన్స్, లెదర్ బెల్ట్‌లు, క్లాత్ బెల్టులను ఉపయోగిస్తూ ప్లాట్ చెప్పులను ఇలా అందంగా సింగారించవచ్చు. {yెస్‌కు మ్యాచింగ్ చెప్పులు ధరించి మరింత అందంగా మెరిసిపోవచ్చు.

 

మరిన్ని వార్తలు