తరగక ముందే కడగాలి

31 Oct, 2019 04:02 IST|Sakshi

ఇంటిప్స్‌

► ఆకు కూరలను ఉప్పునీటితో కడిగితే త్వరగా శుభ్రపడుతాయి. మామూలు నీటితో నాలుగు సార్లు కడగడం కంటే ఉప్పు నీటితో రెండుసార్లు కడిగితే చాలు.
► ఆకుకూరలు, కూరగాయలను కడిగిన తర్వాత మాత్రమే తరగాలి. తరిగిన తర్వాత కడిగితే వాటిలో ఉండే పోషకాలు నీటిలో కలిసిపోతాయి.
► జిడ్డు పట్టిన ఇనుప పెనాలను శుభ్రం చేయడం కష్టం. పెనం మీద ఉప్పు చల్లి, పేపర్‌తో తుడిచి ఆ తర్వాత సబ్బునీటితో శుభ్రం చేయాలి.
► కప్పుల్లో చివరగా మిగిల్చే కొద్దిపాటి కాఫీ, టీల వల్ల కప్పు అడుగున మరకలు పడుతుంటుంది. అలా పట్టేసిన మరకలు పోవాలంటే పొడి కప్పులో ఉప్పు చల్లి రుద్దాలి.
► రిఫ్రిజిరేటర్‌ లోపల శుభ్ర పరచడానికి ఉప్పు, సోడా బైకార్బనేట్‌ కలిపిన నీటిని వాడాలి. సోడా బైకార్బనేట్‌ రిఫ్రిజిరేటర్‌లో దుర్వాసనను కూడా పోగొడుతుంది. చిన్న కప్పులో (వంటసోడా) వేసి ఫ్రిజ్‌లో ఒక మూల పెడితే కొద్దిగంటల్లోనే దుర్వాసన పోతుంది.
► రాగి పాత్రల మీద మరకలు పోవాలంటే మరకల మీద ఉప్పు చల్లి వెనిగర్‌లో ముంచిన క్లాత్‌తో తుడవాలి.
► ద్రాక్షపండ్ల మీద చల్లిన రసాయనాలు వదలాలంటే ఉప్పు కలిపిన నీటిలో కనీసం గంటసేపు ఉంచి కడగాలి.

మరిన్ని వార్తలు