-
పండగొస్తోంది...మిక్సర్ గ్రైండర్ క్లీనింగ్ టిప్స్ : కొత్తగా మెరుస్తుంది
పూర్వకాలంలాగా రోళ్లు, కలం, తిరగళ్లు ఇపుడు పెద్దగా వాడటం లేదు. అవి ఎలా ఉంటాయో, ఎలా పనిచేస్తాయో కూడా ఈ తరం చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇపుడంతా మిక్సీలు, గ్రైండర్లు మయమే. అటు ఉగాది పండుగ సమీపిస్తోంది. ఉగాది నుంచి వరుసగా పండుగలు షురూ అవుతాయి. చుట్టాలు, పక్కాలు.. కొత్త అల్లుళ్లు.. హితులు..స్నేహితులు ..ఈ సందడి మామూలుగా ఉండదు. ఇలాంటి సమయంలో మన వంట ఇంటిలో అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా మిక్సీ గ్రైండర్. మిక్సర్ గ్రైండర్ లేకుండా వంటను ఊహించుకోవాలంటేనే కష్టం. ఒక్కోసారి జార్స్ సరిగ్గా పనిచేయక ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సరిగ్గా పని ఉన్నపుడో, చుట్టాలొచ్చినపుడో పని చేయనని మొరాయిస్తుంటాయి. అయితే దీనికి కారణాలు చాలా ఉన్నాయి. సాధారణంగా పచ్చళ్లు, రకరకాల పొడులు, పొడులు, అల్లం వెల్లుల్లి, ఇతర పేస్ట్‌లు చేసేందుకు మిక్సీ గ్రైండర్ వాడతాం. వాడిన తరువాత ఎప్పటికపుడు చక్కగా క్లీన్ చేసుకోవాలి. గాస్కట్ (జార్ మూత చుట్టూ ఉండే రబ్బరు) బ్లేడ్లు కూడా తీసి శుభ్రం చేసుకోవాలి. లేదంటే మిక్సీజార్తో పని ఎంత సులువో, అది మొరాయిస్తే అంత కష్టం. ఎప్పటికప్పుడు క్లీన్‌గా నీట్‌గా ఉంచుకుంటేనే, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా ఎక్కువరోజులు మన్నుతాయి. మిక్సీని, జార్స్‌ని ఎలా క్లీన్ చేయాలి? వంటసోడా: మురికి పట్టి, మొరాయించిన మిక్సీ జార్ సరిగ్గా పనిచేయాలంటే.. బేకింగ్ సోడా కూడా హెల్ప్ చేస్తుంది. బేకింగ్ పౌడర్‌లో కొద్దిగా వేడి నీరు పోసి పేస్టులా చేయండి. దీంతో జార్స్‌ని అప్లై చేసి, కొద్దిగా జార్లో వేసిన రెండు సార్లు తిప్పాలి. ఈ తర్వాత శుభ్రమైన నీటితో క్లీన్ చేయండి. వెనిగర్: వెనిగర్, నీళ్లు కలిపి జార్స్‌లో వేసి కాసేపు అలానే ఉండనివ్వండి. ఒక్కసారి మిక్సీ వేయండి. తరువాత నీటితో క్లీన్ చేస్తే బ్లేడ్లు, జార్ మొత్తం శుభ్రంగా తయారవుతుంది. పిండి , జార్లో పేరుకుపోయిన వ్యర్థాలను సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది. నిమ్మ తొక్కలు: నిమ్మ తొక్కలతో కూడా జార్స్‌ని చక్కగా క్లీన్ చేయొచ్చు. నిమ్మతొక్కలు, కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ కొద్దిగా నీరు వేసి మిక్సీని ఆన్ చేయండి. ఒకటి రెండు నిమిషాలు తిప్పండి. అలాగే మిక్సీని మొత్తాన్నికూడా జాగ్రత్తగా మెత్తని క్లాత్‌తోగానీ, స్పాంజితో గానీ క్లీన్ చేసుకుంటే.. చక్కగా కొత్తదానిలా మెరిపోతుంది. నోట్ : మిక్సీని క్లీన్ చేసేటపుడు బ్లేడుల కారణంగా మన చేతి వేళ్లు తెగకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మిక్సీ మోటర్లోకి అస్సలు వాటర్ పోకూడదు. ఒక్క చుక్క నీరు పోయినా మోటర్ పాడయ్యే అవకాశం ఉంది. -
Summer: సీలింగ్ ఫ్యాన్.. క్లీనింగ్ ఇలా...!
సాధారణంగా సీలింగ్ ఫ్యాన్లను ఎక్కువ ఎత్తులో అమర్చుతారు. అందువల్ల వాటిని తరచు శుభ్రం చేయడం చాలా కష్టం. అలాగని నెలల తరబడి అలాగే ఉంచేస్తే మురికి పేరుకుని పోయి అసహ్యంగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో పాత పిల్లో కవర్ తీసుకుని టేబుల్ మీద ఎక్కి సీలింగ్ ఫ్యాన్ రెక్కలను కవర్ చేయాలి. కవర్ పైభాగం నుంచి మీ చేతులతో రుద్దాలి. అదేవిధంగా, మూడు రెక్కలను శుభ్రం చేయాలి. మట్టి కూడా కవర్లో పడిపోతుంది. ఇది మీ ఇంటిని కూడా మురికిగా చేయదు. మరో పద్ధతి... పాత షర్ట్, టీషర్ట్ లేదా ఏదైనా కాటన్ వస్త్రం సహాయంతో ఫ్యాన్‌ను శుభ్రం చేయవచ్చు. ఫ్యాన్ మీద ΄÷డి దుమ్ము ఉంటే.. అది సులభంగా ఒక వస్త్రంతో శుభ్రం చేసుకోవచ్చు. ఒకవేళ వంటగదిలో ఉండే ఫ్యాన్‌ను క్లీన్ చేస్తున్నట్లయితే.. దానిపై నూనె, ధూళి పేరుకుపోయి ఉంటుంది. అటువంటి వాటిని సబ్బుతో కడగడం మంచిది. కాసేపు రెక్కలను స్క్రబ్ చేయాలి. గుర్తుంచుకోవాల్సింది.. ఫ్యాన్‌ను క్లీన్ చేసినప్పుడల్లా కింద ఒక షీట్ లేదా వస్త్రాన్ని పరచాలి. దీంతో ఫ్యాన్ క్లీన్ అయిన తర్వాత మీకు పని పెరగదు. ఫ్యాన్ మురికి షీట్లో పడిపోతుంది. ఫ్యాన్ శుభ్రం చేసేటప్పుడు గ్లాసెస్ లేదా సన్‌గ్లాసెస్ ధరించండి. ఇది చెత్తను కంట్లో పడకుండా చేస్తుంది. దీంతో అలర్జీ కూడా రాదు. సీలింగ్ ఫ్యాన్ శభ్రం చేసేటపుడు ముక్కుకు మాస్క్ లేదా రుమాలు కట్టుకోవాలి. ఇవి చదవండి: ఆ తల్లీ కూతుళ్లకి అందుకే అంత ధైర్యం..! -
ఇయర్ వాక్స్.. లాభమా? నష్టమా?
'కొంతమందిని చూస్తే ఎప్పుడూ ఏ తాళం చెవో, పెన్ను రీఫిలో, పొడవుగా చుట్టిన కాగితాన్నో, ఏవీ దొరక్కపోతే చేతివేళ్లతోనో చెవిలో సంగీతం పాడిస్తుంటారు. ఈ చికాకంతా ఎందుకని చాలామంది స్నానం చేయగానే వీలైనంత లోతుగా చెవిని శుభ్రం చేస్తుంటారు. కానీ బయటికి కనిపించే చెవి కాకుండా లోపలి వైపు శుభ్రం చేయాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.' ఇంతకీ చెవి ఎలా శుభ్రం చేయాలో చూద్దాం... కాటన్ బడ్ పెట్టడం వల్ల అది ఇయర్ వాక్స్‌ని చెవి లోపలికి మరింతగా నెట్టివేస్తుంది. అంతేకాదు, చెవిలో పెట్టిన బడ్ కర్ణభేరికి తగలవచ్చు. ఇది మరింత ప్రమాదకారి. దీనివల్ల వినికిడి శక్తి దెబ్బతింటుంది. నిజానికి ఇయర్ వాక్స్ వల్ల చెవులకు లాభమేగానీ నష్టం లేదు. బయటినుంచి వేరే పదార్థాలు, క్రిముల వంటివి చెవి లోపలికి వెళ్లకుండా ఇది రక్షిస్తుంది. శిలీంధ్రాలు లేదా ఫంగస్ ఏర్పడకుండా నివారిస్తుంది. చెవిలోని నాళం పొడిబారకుండా ఉండేందుకు దోహదపడుతుంది. మరి ఇయర్ వాక్స్‌ని ఏం చేయాలి? దాని జోలికి వెళ్లకుండా ఉండడమే సరి. వాక్స్ తీయడం కోసం చెవి లోపల ఇయర్ బడ్ మాత్రమే కాదు. ఇంకేమీ పెట్టక్కరలేదు. ఎందుకంటే, చెవి తనను తానే శుభ్రం చేసుకోగలుగుతుంది. ఒకవేళ చెవిలో శబ్దాలు రావడం, నొప్పి లాంటి సమస్యలు కనిపించినా, వినికిడిలో తేడా అనిపించినా వెంటనే ఈఎన్టీ నిపుణుని కలవండి. ఇవి చదవండి: 'పచ్చి మిరపకారా'నికి గారం చేయండి.. ఎందుకో తెలుసా? -
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట: ఆలయాలు శుభ్రం చేస్తున్న ప్రముఖులు (ఫొటోలు)
-
రామాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన నటుడు
అయోధ్యలో ఈ నెల 22న బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ నటులు హాజరుకానున్నారు. ఇంతలో ఒక నటునికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్.. రామాలయ ప్రాంగణాన్ని, మెట్లను శుభ్రం చేస్తూ ఒక వీడియోలో కనిపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు జాకీష్రాఫ్‌ను మెచ్చుకుంటున్నారు. 66 ఏళ్ల జాకీ ష్రాఫ్ ముంబైలో జరిగిన పురాతన రామాలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. రామునిపై ఆ నటునికి ఉన్న భక్తిని, అతని సింప్లిసిటీని అభిమానులు కొనియాడుతున్నారు. ‘ఎక్స్’లో షేర్ చేసిన ఈ వీడియోను యూజర్స్ అమితంగా ఇష్టపడుతున్నారు. పలువురు అభిమానులు రకరకాలుగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఒక యూజర్ జాకీని ఉద్దేశించి ‘జీరో నుంచి హీరోగా మారిన వ్యక్తి’ అని కామెంట్ చేయగా, మరొకరు, 'కెమెరా ముందు.. కెమెరా వెనుక అత్యంత వినయుడు' అని రాశారు. జాకీ ష్రాఫ్ అప్పుడప్పుడు పలు సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు. నిరుపేద చిన్నారులకు వైద్య చికిత్స చేయించేందుకు, అలాంటి వారికి విద్య అందించేందుకు జాకీష్రాఫ్ విరాళాలు అందిస్తుంటారు. ఆయన సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు. #WATCH | Maharashtra: Amruta Fadnavis wife of Maharashtra Deputy CM Devendra Fadnavis & Bollywood actor Jackie Shroff took part in the cleanliness drive of the oldest Ram temple in Mumbai. (14.01) pic.twitter.com/mhdkzcNB5x — ANI (@ANI) January 14, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
ఇంటింటికీ మేలు చేశాం...ఆశీర్వదించండి
మీలో ఒకడినై ఉంటా...ఆదరించండి
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
పచ్చ గద్ద
మరో రెండు రోజులు వానలు
గుడ్ మార్నింగ్.. ఏలూరు
13,103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్
పోలింగ్ నిర్వహణకు పటిష్ట ప్రణాళిక
తప్పక చదవండి
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్‌తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
Advertisement