జర్నలిస్టు కె.ఎల్.రెడ్డికి రూ.15 లక్షల సాయం

14 Jun, 2016 03:48 IST|Sakshi
జర్నలిస్టు కె.ఎల్.రెడ్డికి రూ.15 లక్షల సాయం

చెక్కును అందించిన సీఎం కేసీఆర్

 సాక్షి, హైద రాబాద్: వయోధిక పాత్రికేయుడు, తొలితరం తెలంగాణ పాత్రికేయ ఉద్యమకారుడు, ర చయిత కంచర్ల లక్ష్మారెడ్డి (కె.ఎల్.రెడ్డి)కి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంతోపాటు అనేక సామాజిక అంశాలపై అక్షర సమరం సాగిస్తున్న కె.ఎల్.రెడ్డి ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి, సోమవారం కె.ఎల్.రెడ్డిని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి, యోగ క్షేమాలు విచారించారు.

అన్ని విధాల ఆదుకుంటానని హామీ ఇచ్చారు. వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం రూ.15 లక్షల చెక్కును అందించారు. ఏడు దశాబ్దాల పాటు ఆయన పాత్రికేయ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ సహాయం అందిస్తున్నట్లు సీఎం చెప్పారు. నల్లగొండ జిల్లా నరసాయపల్లెకు చెందిన కంచర్ల లక్ష్మారెడ్డి వయసు 85 సంవత్సరాలు. కాగా, తన పట్ల ముఖ్యమంత్రి చూపించిన ఆదరణకు కె.ఎల్. రెడ్డి కృతజ్ఞతలుతెలిపారు.

మరిన్ని వార్తలు