ఆరోగ్య రికార్డుల డిజిటైజేషన్‌

25 Feb, 2017 00:30 IST|Sakshi

టాటా ట్రస్ట్‌తో వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజలందరి ఆరోగ్య రికార్డులన్నింటినీ డిజిటైజేషన్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీహెచ్‌సీలు మొదలు నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల వరకు వచ్చే రోగుల వైద్య వివరాలను ఆన్‌లైన్‌లో భద్రపరచనుంది. ఈ బాధ్యతను టాటా ట్రస్ట్‌కు అప్పగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డుగా పిలిచే ఈ పద్ధతిలో రోగులందరి ఆరోగ్య సమాచార వివరాలను రిపోర్టులతో సహా స్కానింగ్‌ చేసి ఆన్‌లైన్‌లో ఉంచుతారు.

సంబంధిత రోగికి కేటాయించిన ఆన్‌లైన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయగానే వారి ఆరోగ్య రికార్డులు వస్తాయి. మరో నంబర్‌ ఏదైనా ఇచ్చినా ఆధార్‌ నంబర్‌తోనే సమాచారం వచ్చేలా చేయాలని భావి స్తున్నారు. ఎప్పటిలోగా దీన్ని పూర్తి చేయాలనేది ఖరారు కాలేదని టాటా ట్రస్ట్‌ ప్రతినిధి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

>
మరిన్ని వార్తలు