అంబులెన్స్‌లోకి ఎక్కించాక కూడా సిగరెట్‌..

10 May, 2017 17:37 IST|Sakshi
అంబులెన్స్‌లోకి ఎక్కించాక కూడా సిగరెట్‌..

రబత్‌: తప్పు చేయాలంటేనే ప్రతి ఒక్కరూ భయపడుతుంటారు. ఒక వేళ చేస్తున్నా అది బయటకు తెలియకుండా జాగ్రత్త పడతారు. అయితే అది ఎప్పటికో బయటపడుతుందిగానీ ఆ సమయానికి తీవ్రత తక్కువగా ఉంటుంది. కానీ, తాను తప్పు చేస్తున్నాను చూడండహో అంటూ ఓ 20 ఏళ్ల యువకుడు ఏకంగా సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేశాడు. ఫుల్లుగా మధ్యం సేవిస్తూ ఫెరారీ కారును డ్రైవింగ్‌ చేస్తూ ఆ వీడియోలను నేరుగా ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మీడియా సైట్‌లలో పోస్ట్‌ చేశాడు.

అలా అతడు డ్రైవింగ్‌ చేస్తున్న క్రమంలోనే మరో కారు ఢీకొట్టి అప్పుడు కూడా ఏ మాత్రం భయపడకుండా పోలీసులు వచ్చిన లక్ష్యపెట్టకుండా వారి పనుల్లో వారు నిమగ్నమై ఉండగా అతడు మాత్రం అదే తీరుతో వ్యవహరించాడు. తానొక తప్పు చేశానని, మరో కారును ఢీకొట్టాననే విషయం కూడా ఆదమరిచి పోలీసుల ముందే ఫుల్లుగా తాగుతూ వీడియోలు తీసుకుంటూ కనిపించాడు. ఖండించాల్సిన మరో విషయం ఏమిటంటే అతడిని అంబులెన్స్‌లోకి ఎక్కించాక కూడా సిగరెట్‌ తాగుతూ దానిని కూడా వీడియో తీసి పెట్టాడు. మొరాకోలోని రాబత్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

గత నెలలో పోలీసులు అరెస్టు చేయగా అతడికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. అయితే, ఆ యువకుడు స్థానికంగా ఉండే ఓ బడా వ్యాపారి మేనళ్లుడంట. అతడికి రూ.1.4లక్షల ఫైన్‌ కూడా విధించారు. అయితే, ప్రస్తుతం అతడికి జైలులో కూడా సకల సౌకర్యాలు ఇస్తూ ప్రత్యేకంగా పరిగణిస్తున్నారంట. అదేదో సినిమాలో అన్నట్లు పేదోడు తాగితే తాగుబోతని, ధనవంతులు తాగితే పార్టీ చేసుకున్నారని అన్నట్లు సమాజానికి హానీ చేసే ఈ ధనవంతుల కుటుంబానికి చెందిన యువకుడికి ఏ పేరు పెట్టి పిలవాలో మరి.

మరిన్ని వార్తలు