నేపాల్లో భూకంపం

9 Apr, 2016 20:31 IST|Sakshi

ఖాట్మాండు: నేపాల్లో మరోసారి స్వల్ఫ భూప్రకంపనలు సంభవించాయి. శనివారం రాత్రి నేపాల్ రాజధాని ఖాట్మాండులో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైంది.  

ప్రజలు భయంతో ఒక్కసారిగా తమ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. కాగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఖాట్మాండుకు సమీపంలో ఉన్న లలిత్పూర్లోని భైన్సేపతిలో భూకంప కేంద్రాన్ని నేషనల్ సెస్మలాజికల్ సెంటర్ గుర్తించింది.

మరిన్ని వార్తలు