ఎలుగుబంటి కారు ఎక్క‌డం చూశారా? వీడియో వైర‌ల్

25 May, 2020 15:25 IST|Sakshi

స‌ర‌దాగా ప్ర‌కృతి ఒడిలో స‌ర‌దాగా సేద తీరుతూ ఆహ్లాదంగా గ‌డుపుదామని క్యాంపింగ్‌కు వెళ్తున్న  ఓ కుటుంబానికి ఊహించని ప‌రిణామం ఎదురైంది. మ‌ధ్య‌లో చిన్న బ్రేక్ తీసుకుందామ‌ని ఆ అట‌వీ ప్రాంత అందాల‌ను కెమెరాలో బంధిస్తున్న వారి కారును ఎవ‌రో అక‌స్మాత్తుగా హైజాక్ చేశారు.  అనుకోని అతిథి క‌నిపించ‌డంతో అంద‌రూ షాక్‌కి గుర‌య్యారు. ఇంత‌కీ ఆ అతిథి ఎవ‌రో తెలుసా ఎలుగుబంటి.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే...జోస్ లూయిస్ ఫ్యామిలీతో స‌హా అట‌వీ ప్రాంతానికి విహార‌యాత్ర‌కు బ‌య‌లుదేరారు. అక్క‌డ కారు దిగి ప్ర‌కృతి అందాల‌ను ఫోన్‌లో బంధిస్తుంటే..అక‌స్మాత్తుగా ఓ పెద్ద ఎలుగుబంటి చేరుకొని అక్క‌డ  ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ద‌ర్జాగా కారు తెరిచి లోప‌లికి ఎక్కే ప్ర‌య‌త్నం చేసింది. ఈ మొత్తం వ్య‌వ‌హ‌రాన్ని కొంత దూరం నుంచి చూస్తున్న వారికి అస‌లు అక్క‌డ ఏం జ‌రుగుతుందో అర్థం కాక గట్టిగట్టిగా అరుస్తూ కేకలు వేశారు. దీంతో ఒకింత ఆందోళ‌న‌కు గురైన ఎలుగుబంటి కారు లోప‌లికి ఎక్క‌కుండానే కాస్త వెన‌క్కి తగ్గి అట్నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాల పోస్ట్ చేయ‌డంతో తెగ వైర‌ల్ అయ్యింది. ఇప్ప‌టికే ఈ వీడియోను 28,300 మంది చూశారు. నాకు కూడా మీ కారులో లిఫ్ట్ ఇస్తారా??  వ‌ద్దు లేండీ నా నిర్ణ‌యాన్ని మార్చుకున్నా అంటూ ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు.
 (వైరల్‌.. ఆకతాయిలపై గేదె ప్రతీకారం! )

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా