జిన్‌పింగ్‌ కోసం రాజ్యాంగ సవరణకు సిద్ధం

4 Mar, 2018 03:43 IST|Sakshi
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌

బీజింగ్‌: కమ్యూనిస్ట్‌ చైనాలో వార్షిక పార్లమెంటు సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రస్తుత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను నిరవధికంగా అదే పదవిలో కొనసాగేలా రాజ్యాంగంలో మార్పులు చేసే అవకాశముంది. చైనా పార్లమెంటు అయిన జాతీయ ప్రజా కాంగ్రెస్‌తో పాటు చైనీస్‌ పీపుల్స్‌ పొలిటికల్‌ కన్సల్టేటివ్‌ కాన్ఫరెన్స్‌సభ్యులైన దాదాపు 5,000 మంది ఈ సమావేశాలకు హాజరు కానున్నారు.  ఎన్‌పీసీలో 269 మిలటరి ప్రతినిధులు సహా 2,980 మంది సభ్యులున్నారు. చైనాలో అన్ని రంగాల ప్రముఖులతో ఏర్పాటుచేసిన సీపీపీసీసీలో యాక్షన్‌ నటుడు జాకీచాన్‌ కూడా సభ్యుడిగా ఉండటం విశేషం.  

మరిన్ని వార్తలు