ట్రంప్‌ కూడా వచ్చేశాడోచ్...!

10 Jun, 2018 20:48 IST|Sakshi

సింగపూర్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సింగపూర్‌ చేరుకున్నారు. అంత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న భేటీ నేపథ్యంలో ట్రంప్‌ సింగపూర్‌ పర్యటనకు వెళ్లారు. ఈ 12న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌తో పలు అంశాలపై ట్రంప్‌ చర్చించనున్నారు. కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సులో పాల్గొన్న డొనాల్డ్‌ ట్రంప్‌ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో సింగపూర్‌ వచ్చారని అధికారులు తెలిపారు.

కిమ్‌కు స్వాగతం పలికిన సింగపూర్‌ విదేశాంగశాఖ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌ అమెరికా అధ్యక్షుడికి కూడా ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక భద్రత మధ్య హోటల్‌కు ట్రంప్‌ చేరుకున్నారు. అయితే కిమ్‌తో భేటీపై ఎలా స్పందిస్తారన్న ప్రశ్నకు.. వెరీ గుడ్‌ అంటూ సమాధానమిచ్చారు. మరోవైపు ట్రంప్‌తో భేటీ కోసం ఉత్తరకొరియా నేత కిమ్‌ ఇదివరకే సింగపూర్‌ చేరుకుని ప్రధాని లీ హీన్‌ లూంగ్‌తో భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించారు. కాగా, దేశంలో రెండు దేశాల అధినేతలు కీలక భేటీకి రావడంతో సింగపూర్‌ అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

భారత కాలమానం ప్రకారం ఈ నెల 12న (మంగళవారం) ఉదయం 6.30 గంటలకు సింగపూర్‌లో కిమ్‌, ట్రంప్‌ భేటీ కానున్నారు. అయితే కిమ్‌ వైఖరి నచ్చకపోతే మధ్యలోనే వెళ్లిపోతానంటూ తన మీటింగ్‌ పార్ట్‌నర్‌కు ట్రంప్‌ హెచ్చరికలు పంపిన విషయం తెలిసిందే.   

మరిన్ని వార్తలు