కరోనా వేళ.. కొత్త రకం కరెన్సీ!

13 Jul, 2020 09:23 IST|Sakshi

వాషింగ్టన్‌ డీసీ: డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? ఈ మాట సర్వసాధారణంగా మనం ఏదో ఒక చోట వింటూనే ఉంటాం. అయితే ఆ మాట ఇప్పుడు నిజమైంది. అది మారుమూల ఏదో ఒక వెనుకబడిన దేశంలో కాదు, అగ్రరాజ్యంలోనే చెట్లకు డబ్బులు కాస్తున్నాయి. అదేంటి వింతగా చెట్లకు డబ్బులు కాయడం ఏంటా అనుకుంటున్నారా. అయితే ఇది చదవండి.  కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే చెప్పొచ్చు. ధనిక, పేద దేశాలనే తేడా లేకుండా అన్ని దేశాలు కరోనా కోరల్లో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీల మాట అటుంచితే ఇక కరోనా మహమ్మారి కారణంగా చిరు వ్యాపారులు, చిన్న చితక పనులు చేసుకునే వారి జీవితాలు అతలాకుతలమయ్యాయి. చేతిలో డబ్బు లేక వారంతా విలవిలలాడుతున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవశ్యకత ఏర్పడింది. అందుకోసం ఒక కొత్త కరెన్సీకి శ్రీకారం చుట్టింది అమెరికాలోని ఒక చిన్న పట్టణం.  వాషింగ్టన్ రాష్ట్రంలోని టెనినో అనే చిన్న పట్టణంలో ఒక నూతన ఒరవడిని ప్రారంభించింది. అక్కడ చెక్క కరెన్సీని తయారు చేసి చలామణిలోకి తీసుకువచ్చారు. దానిని ‘కోవిడ్‌ డబ్బు’ అని పిలుస్తున్నారు. అక్కడ ఏది కొనడాకైనా ప్రజలు ఇప్పుడు ఆ డబ్బునే వినియోగిస్తున్నారు. మద్యం, పొగాకు, గంజాయి మినహా మిగిలిన వాటన్నింటిని ఈ డబ్బుతో కొనవచ్చు.  దీనిని మాపుల్ వెనిర్ అనే కలప నుంచి తయారు చేస్తున్నారు. ఇది తెలుపు, తేల పసుపు రంగులో ఉంటుంది. దానిపై అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ చిత్రాన్ని ముద్రించారు. 

చదవండి: కాయ్‌ రాజా కాయ్‌.. కరోనా కేసులపై బెట్టింగ్‌ల జోరు 

పర్యాటక రంగంపై ఆధారపడే నగరం టెనినో, అమెరికాలో కరోనా లాక్‌డౌన్ నుంచి  అనేక  సమస్యలను ఎదుర్కోంటోంది.  దాని ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. దీంతో వారు చెక్క డబ్బును ఆవిష్కరించారు.  స్థానిక వ్యాపారాలు నిర్వహించడం కోసం  సిటీ హాల్‌లో రియల్ డాలర్ల కోసం దాన్ని రీడీమ్ చేసుకోవచ్చు. దీనిపై టెనినో  ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు టైలర్ విట్వర్త్ మాట్లాడుతూ, ‘ఈ డబ్బు ఎక్కడికి వెళుతుందో మాకు తెలియదు. కానీ చెక్క కరెన్సీతో, మేం ఇక్కడి సమాజంలో బతకవచ్చు’ అని పేర్కొన్నారు. 

చదవండి: కరోనా అతని ఆయుష్షు పెంచింది!


 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు