స్కెలిటన్ల షో... బెక్హాం

16 Sep, 2015 08:28 IST|Sakshi

న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో విక్టోరియా బెక్హాం ఫ్యాషన్ కవాతు  ఇప్పుడు అనేది విమర్శలకు నెలవైంది. అస్థిపంజరాల (స్కెలెటన్స్) ప్రదర్శనగా మారింది. 2010 లో విక్టోరియా బెక్హాం తన క్యాట్ వాక్ లో సన్నని, అనారోగ్యంగా కనిపించే మోడల్స్ ను  తాను  నిషేధించినట్లు ప్రకటించింది. అయితే అప్పట్లో ఆ విషయం పలు విమర్శలకు దారి తీసింది.

ప్రస్తుతం న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ చూస్తే బెక్హాం తన మాటను వెనక్కు తీసుకున్నట్లు కనిపించింది  సన్నని, అస్థిపంజరాలను తలపించే శరీరాకృతిలో ర్యాంపుపై నడచిన మోడల్స్ ను చూసిన జనం విమర్శలు గుప్పిస్తున్నారు.  ఈ షో  స్కెలెటన్ షో ను తలపించిందని ఫేస్ బుక్, ట్విట్టర్లలో గగ్గోలెత్తుతున్నారు.  ఆదివారం జరిగిన  ఫ్యాషన్ పెరేడ్ కు ఆమె భర్త డేవిడ్, పదహారేళ్ళ కుమారుడు బ్రూక్లిన్, అమెరికన్ వోగ్ సంపాదకుడు అన్నా వింటర్ కూడ హాజరయ్యారు.

అయితే పదిహేను మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్న స్ట్రాంగ్ సోషల్  మీడియా నోట్లో ఇప్పుడు విక్టోరియా బెక్హాం విమర్శలే నానుతున్నాయి. ఆమె డిజైన్ల ప్రదర్శనకు ఎంచుకున్న మోడల్స్ ఛాయిస్ ను కొందరు తిట్టి పోస్తుంటే... మరి కొందరు సెటైర్లు వేస్తున్నారు. స్కెలెటన్ షోలా ఉందని ఒకరు, ఆ మోడల్స్ అనారోగ్యంగా కనిపిస్తున్నారని మరొకరు ఫేస్ బుక్ లో కామెంట్లు విసిరేస్తున్నారు. ఎక్కువశాతం మంది బెక్హాం డిజైన్లకు పదిహేడేళ్ళ సన్నటి పేటన్ నైట్ ను  ఎంచుకోవడాన్నిఆక్షేపిస్తున్నారు. నైట్... మోడల్ ఏజెన్సీలో మొదటిసారి పదకొండేళ్ళ ప్రాయంలోనే సైన్ చేసిందని, ఫ్యాషన్ డిజైనర్స్ అమెరికా కౌన్సిల్ నిర్ణయం ప్రకారం  అప్పటికి ఆమె ఒక్క ఏడాది మాత్రమే పెద్దదని అంటున్నారు.

మరి కొందరు ఫ్యాషన్ అభిమానులు ఏకంగా మోడల్స్ కు కాస్త తిండి పెట్టే ప్రయత్నం చేయమని సెటైర్లు విసురుతున్నారు. వారిని కాస్త బలంగా కనిపించేట్టు చేయమని దేవుడ్నిసైతం వేడుకుంటున్నారు. అయితే బెక్హాం తన ప్రదర్శనలకు మోడల్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో విభిన్న నిర్ణయాలు తీసుకోవడం ఇది మొదటిసారి కాదు. ఈ సంవత్సరం మొదట్లో కూడ తన కలెక్షన్స్ ప్రదర్శనకు బెక్హాం ఓ సన్నని మోడల్ నే ఎంచుకుంది.

అయితే షో తర్వాత కామెంట్స్ పై స్పందించిన బెక్హాం తన కలెక్షన్లు అన్ని సెజుల్లోనూ, ఆకృతుల్లోనూ ఉంటాయని, ఇదే విషయాన్ని తాను చాలాసార్లు చెప్పానని అంది. ఎవరెన్ని అన్నా.. తన డిజైన్లను మహిళలు తమకు బెస్ట్ గా ఫీలవుతారని చెప్పుకొచ్చింది. 

>
మరిన్ని వార్తలు