జాదవ్‌ కేసు... పాక్‌ ‘మానవతా దృక్పథం’

10 Nov, 2017 20:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  కులభూషణ్‌ జాదవ్‌ వ్యవహారంలో పాకిస్థాన్‌ ప్రభుత్వం కాస్త మెత్తబడింది. జైల్లో ఉన్న అతన్ని చూసేందుకు జాదవ్‌ భార్యను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు భారత హై కమిషన్‌కు ఓ లేఖ పంపగా..  పాకిస్థాన్‌ ప్రభుత్వ అధికారిక సంస్థ పీటీవీ ఈ విషయాన్ని ధృవీకరించింది.

‘మానవతా ధృక్పథంతోనే’.. తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, తన భర్తను చూసేందుకు అనుమతించాలని ఆయన అరెస్ట్‌ తర్వాత చాలాసార్లు ఆమె అక్కడి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. అక్కడి అధికారులు తిరస్కరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం నుంచి పాక్‌పై విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్నాయి. వాటికి తలొగ్గే ఆమెకు వీసా మంజూరు చేసి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

కాగా, గూఢాచర్యం ఆరోపణలతో కులభూషణ్‌ జాదవ్‌ను మార్చి 3, 2016లో బెలొచిస్థాన్‌ మష్కెల్‌ వద్ద పాక్‌ సైన్యం అదుపులోకి తీసుకుంది. దఫాలుగా విచారణ జరిపిన పాక్‌ మిలిటరీ కోర్టు ఏప్రిల్‌ 10న మరణశిక్ష అతనికి మరణశిక్ష విధించింది. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం చేసుకుని తుది వాదనలు పూర్తయ్యేదాకా శిక్షను అమలు చేయొద్దని ఆదేశాలు వెలువరించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 13న భారత్‌ పాక్‌ ఆరోపణలను తోసిపుచ్చుతూ నివేదికను సమర్పించగా.. డిసెంబర్‌ 13న పాక్‌ తన వాదనలను వినిపించనుంది. 

మరిన్ని వార్తలు