కొడుకు హంతకుడిని క్షమించిన తల్లి

17 Apr, 2014 19:34 IST|Sakshi
కొడుకు హంతకుడిని క్షమించిన తల్లి

ఆమె కొడుకు హంతకుడు ఉరికంబంపై ఉన్నాడు. అతని ముఖంపై నల్లని ముసుగు. మెడ చుట్టూ ఉరితాడు బిగించి ఉంది. ఇంకొన్ని క్షణాల్లో అతను శవమై వేలాడతాడు. ప్రజలందరూ చూస్తూండగా హంతకుడు ఆఖరి శ్వాసలు లెక్కబెట్టుకుంటున్నాడు.


అంతలో ఆ తల్లి అతని దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. 'కొడుకు లేని ఇంట్లో బ్రతకడం ఎంత కష్టమో తెలుసా?' అని గట్టిగా అరుస్తూ అతని తల మీది ముసుగును, ఉరితాడును లాగేసింది. క్షణాల్లో చనిపోవాల్సిన ఆ హంతకుడు భోరు భోరున ఏడుస్తూ ఆమె పాదాలమీద పడిపోయాడు.


ఇదేదో సినిమాలోని ఎమోషనల్ సీన్ అనుకుంటున్నారా? కానేకాదు. ఇరాన్ లోని నౌషహర్ లో నిజంగానే జరిగింది ఈ సంఘటన.
ఆ తల్లి పేరు సమీరా అలీ నెజాద్. ఆమె కొడుకు అబ్దుల్లా హుసేన్ జాదాని 2007 లో ఒక గొడవలో బలాల్ అనే యుకుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఆ  సంఘటనలోనే బలాల్ కి ఉరిశిక్ష పడింది. గురువారం ఆ శిక్ష అమలు కావాల్సింది. ఇరాన్ చట్టాల ప్రకారం బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తూండగా ఉరి తీయాలి. అయితే మృతుడి తల్లి నిందితుడిని క్షమించవచ్చు. అందుకే ఆ సమయంలోనే సమీరా బలాల్ ను క్షమించింది. అయితే కడుపు కోతను చల్లార్చుకోవడానికి ఒక్క లెంపకాయ గట్టిగా కొట్టింది. 'నా కడుపు మంట చల్లారింది. అతడిని క్షమించేశాను. ఇక నా బరువు తీరింది' అంది సమీరా.

మరిన్ని వార్తలు