సొంత నగరాన్ని పేల్చేసుకున్న కిమ్‌

6 Jan, 2018 12:04 IST|Sakshi

వరుస అణు, క్షిపణి ప్రయోగాలతో ప్రపంచాన్ని భయపెడుతున్న ఉత్తర కొరియాకు దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది.  కిమ్‌ ప్రయోగించిన ఒక క్షిపణి.. విఫలమై సొంత నగరమే సర్వనాశనమైంది. ఈ విషయాన్ని అమెరికా ఉన్నతాధికారులు తాజాగా ప్రకటించారు. నియంతాధ్యక్షుడు కిమ్‌ గత ఏడాది ఏప్రిల్‌ 28న హస్వాంగ్‌-12 అనే మధ్య తరహా క్షిపణిని పరీక్షించారు. అయితే ఇది విఫలం కావడంతో ప్యాంగ్యాంగ్‌కు 150 కిలో మీటర్ల దూరంలోని టోక్చాన్‌ అనే పట్టణంపై కూలిపోయింది. 

టోక్చాన్ నగరంలో దాదాపు రెండు లక్షల మంది నివసిస్తున్నారు. కిమ్‌ క్షిపణి అక్కడి పారిశ్రామిక లేదా వ్యవసాయానికి సంబంధించిన భవనాలతో ఉన్న ప్రాంగణం మీద కూలినట్లు తెలుస్తోంది. శాటిలైట్ చిత్రాల ద్వారా అమెరికా ఈ మేరకు నిర్ధారణకు వచ్చింది. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయి ఉంటారన్నదానిపై స్పష్టత లేదు. 

మరిన్ని వార్తలు