ఇస్లామిక్ స్టేట్పై అమెరికా దాడులు

27 Feb, 2015 11:10 IST|Sakshi

ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)పై అమెరికా యుద్ధ విమానాలతో దాడులు ప్రారంభించింది. 220 మంది అస్సిరియన్ క్రైస్తవులను ఐఎస్ ఉగ్రవాదులు బంధీలుగా పట్టుకెళ్లిన అనంతరం అమెరికా ఈ దాడులు జరిపింది. హసాకే ప్రావిన్స్లోని తాల్ తమర్ ప్రాంతాలపై ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే దాడులు ప్రారంభించినట్లు సిరియన్ హక్కుల సంస్థ ఒకటి పేర్కొంది.

 

అయితే ఈ దాడుల వల్ల జరిగిన నష్టం వివరాలేవి ఇంకా తెలియరాలేదు. తాల్ తమర్ చుట్టుపక్కల ఉన్న దాదాపు పది గ్రామాల్లోకి ఐఎస్ ఉగ్రవాదులు చొరబడి వాటిని అదుపులోకి తీసుకుని 220 మందిని బందీలుగా పట్టుకున్నారు. వీరిలో చిన్నారులు, మహిళలు, యువకులు ఉన్నారు.

మరిన్ని వార్తలు