వీగిన ‘పాలస్తీనా’ తీర్మానం

1 Jan, 2015 02:40 IST|Sakshi
వీగిన ‘పాలస్తీనా’ తీర్మానం
  • భద్రతా మండలిలో స్వతంత్ర దేశంగా దక్కని గుర్తింపు
  • న్యూయార్క్: పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించే తీర్మానానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆమోదం లభించలేదు. 2017 కల్లా పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించాలన్న ఈ తీర్మానం వీగిపోయింది.

    బుధవారం మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి 8 దేశాలు మద్దతు పలికాయి. మరో తొమ్మిది దేశాలు వ్యతిరేకించాయి. మద్దతు తెలిపిన దేశాల జాబితాలో అర్జెంటీనా, చైనా, ఫ్రాన్స్, జోర్డాన్, లగ్జెంబర్గ్, రష్యా, చిలీ, చాద్ ఉన్నాయి.

    మండలి వీటో అధికారం ఉన్న ఐదు శాశ్వత సభ్య దేశాలు వ్యతిరేకించకపోతే.. తీర్మానం ఆమోదం పొందడానికి 9 దేశాల మద్దతు అవసరం. కానీ అమెరికా, ఆస్ట్రేలియాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. బ్రిటన్, నైజీరియా, దక్షిణకొరియా, రువాండా, లిథువేనియా ఓటింగ్‌లో పాల్గొనలేదు. మెజారిటీ దేశాల ఆమోదం లభించకపోవడంతో తీర్మానం వీగిపోయింది. కాగా, ఈ తీర్మానంలో పేర్కొన్న వాక్యాలనూ అమెరికా వ్యతిరేకించింది.
     

మరిన్ని వార్తలు