బాలీవుడ్ తెర మీదకు అమల!

15 Dec, 2014 17:46 IST|Sakshi
బాలీవుడ్ తెర మీదకు అమల!

చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉండి.. ఇటీవలే మళ్లీ మేకప్ వేసుకుంటున్న అక్కినేని అమల త్వరలోనే బాలీవుడ్ తెరమీద మెరిసేందుకు సిద్ధమవుతున్నారు. మోహిత్ సూరి దర్శకత్వంలో వస్తున్న 'హమారీ అధూరీ కహానీ' సినిమాలో ఆమె నటిస్తున్నట్లు చిత్ర నిర్మాత మహేశ్ భట్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. తాము తీస్తున్న ప్రేమకథా చిత్రం 'హమారీ అధూరీ కహానీ'లో అమల అక్కినేని నటిస్తున్నట్లు ఆయన చెప్పారు.

తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరు సంపాదించుకున్న అమల.. నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత చాలాకాలం పాటు ముఖానికి రంగేసుకోలేదు. అంతకుముందు శివ, సత్య, పుష్పకవిమానం, నిర్ణయం లాంటి అనేక సినిమాల్లో ఆమె నటించారు. తర్వాత ఇటీవల విడుదలైన 'మనం' చిత్రంలో డాన్స్ టీచర్గా కొద్ది సెకన్ల పాటు కనిపించారు. తమిళ టీవీ సీరియల్ ఒకదాంట్లో కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడు విద్యాబాలన్, ఇమ్రాన్ హష్మి, రాజ్కుమార్ రావు ప్రధానపాత్రల్లో వస్తున్న 'హమారీ అధూరీ కహానీ' సినిమాలో నటిస్తున్నారు.