ఓ ఇంటివారయ్యారు!

23 Jun, 2018 00:40 IST|Sakshi
నిక్‌ జోనస్‌, ప్రియాంకా చోప్రా

అత్తారింటికి దారి వెతుక్కుంటూ ఇండియాకి వచ్చారు ప్రియాంకా చోప్రా బాయ్‌ఫ్రెండ్, హాలీవుడ్‌ సింగర్, ఆర్టిస్ట్‌ నిక్‌ జోనస్‌. అత్తగారిని పరిచయం చేసుకోవడానికి రెక్కల వాహనంపై ఈ కాబోయే అల్లుడుగారు వచ్చారని బాలీవుడ్‌లో అనుకుంటున్నారు. విషయం ఏంటంటే.. ఇటీవలే ప్రియాంకా చోప్రా ఓ ఇంటివారయ్యారు. అదేనండీ... ముంబైలో కొత్త ఇల్లు కొనుక్కున్నారు. ఆ గృహప్రవేశానికి గెస్ట్‌గా తన బాయ్‌ఫ్రెండ్‌ని ఆహ్వానించారట. అలాగే అత్తగారిని కూడా పరిచయం చేసినట్టుంటుందని భావించారేమో, బాయ్‌ఫ్రెండ్‌కి కబురెట్టారు.

  దాంతో గురువారం రాత్రి ముంబై చేరుకున్నారు నిక్‌. ఫారిన్‌లో నిక్, ప్రియాంక బాహాటంగా తిరిగినా ముంబైలో కెమెరా కంటపడకుండా జాగ్రత్త పడ్డారు. ఆల్రెడీ ప్రియాంకాను నిక్‌ తన కజిన్‌ వెడ్డింగ్‌కి తీసుకెళ్లి తమ ఫ్యామిలీకి పరిచయం చేశారు. ఇప్పుడు తల్లి మధుచోప్రాకి పరిచయం చేయడానికే నిక్‌ని ప్రియాంక ముంబైకి రప్పించారట. ఈ లవ్‌ బర్డ్స్‌ ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్‌ చేస్తున్నారంటే త్వరలోనే డోలు భాజా మోగించేందుకు సిద్ధమవుతున్నారని అనుకోవచ్చు.

మరిన్ని వార్తలు