పేరులో ఏదో ఉంది

2 Apr, 2014 03:19 IST|Sakshi
పేరులో ఏదో ఉంది
పేరులో ఏముందని అంత తేలిగ్గా తీసిపారేయకండి. అందులోనే ఉంది మహత్యం అంతా అంటారు జాతకాలను నమ్మేవాళ్లు. ముఖ్యం గా సినిమావాళ్లకు ఈ సెంటిమెంట్స్ ఎక్కువంటారు. అందులోనూ హీరోయిన్లు హిట్‌కు, ఫ్లాప్‌కు మధ్య తమ పేర్లను మార్చుకుం టుంటారు. ఆస్ట్రాలజీపై వారికి బాగా గురి. యువ నటి సునైనా ప్రస్తుతం ఈ ఆస్ట్రాలజీనే నమ్ముకుంటోంది. ఈ పదారణాల తెలుగు అమ్మాయి. కాదలిల్ విళిందేన్ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమ తనవైపు చూసేలా చేసుకుం ది. ఆ చిత్రంలో సునైనా అభినయం అంతగా ఆకట్టుకుంది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేకపోయింది. ఈ మధ్య నటించిన నీర్‌పరవై చిత్రం సమయంలో పేరు మార్చుకుంటే మంచి ఫలితం ఉంటుందన్న ఆస్ట్రాలజిస్ట్ సూచన మేరకు సునైన తన పేరును అనూషాగా మార్చుకుంది. 
 
 ఆ తరువాత కూడా అవకాశాల వేటనే మిగలడంతో మళ్లీ తన అసలు పేరుకే వచ్చేసింది. అయితే అసలు పేరుకు చిన్న కొసరు తగిలించుకుంది. సునైనా పేరు చివరన అదనంగా ఆంగ్ల అక్షరం ఏ ను చేర్చుకుంది. ఇప్పుడు తన పేరు సునైనా అని అంటుంది. ఇది కొంత మంది జ్యోతిష్కుల సలహా మేరకే మార్చుకున్నట్లు చెబుతున్న సునైనా తన కుటుంబ సభ్యులు కూడా ఈ పేరునే ఇష్టపడినట్లు పేర్కొంది. అంతా బాగానే ఉంది. మరి కొత్తగా అవకాశాల మాటేమిటన్న ప్రశ్నకు ప్రస్తుతం నంబియార్ అనే చిత్రంలో శ్రీకాంత్‌కు జంటగా నటిస్తున్నానని తెలిపింది. సంతానం హాస్యభూమికను పోషిస్తున్న ఈ చిత్రానికి గణేషా దర్శకత్వం వహిస్తున్నారని చిత్రం త్వరలో తెరపైకి రానుందని సునైనా చెప్పింది.