పొంగల్‌కి వరోమ్‌

3 Dec, 2017 01:08 IST|Sakshi

... అంటే పొంగలి తింటారా? అని అడుగుతున్నామేమో అనుకుంటున్నారా? నో చాన్స్‌. వరోమ్‌ అంటే వస్తాం అని అర్థం. సంక్రాంతిని తమిళంలో పొంగల్‌ అంటారు. వచ్చే సంక్రాంతికి సూర్య ఇటు తెలుగు అటు తమిళ సినిమాల రిలీజ్‌ రేస్‌లో ఉన్నారు. ఆయన హీరోగా  ‘తానా సేంద కూట్టమ్‌’ అనే చిత్రం రూపొందుతోంది. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో  జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ కథానాయిక. తెలుగులో ‘గ్యాంగ్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు.

శనివారం ‘గ్యాంగ్‌’ ఫస్ట్‌ లుక్‌తోపాటు సినిమాను జనవరి 12న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. ‘‘షూటింగ్‌ కంప్లీట్‌ అయింది. సూర్య సార్, విఘ్నేష్‌ శివన్‌.. మొత్తం యూనిట్‌ని మిస్‌ అవుతున్నా. పొంగల్‌కి వరోమ్‌’’ అన్నారు కీర్తీ సురేశ్‌. ‘‘సూర్య చిత్రాన్ని మా బ్యానర్‌లో రిలీజ్‌ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. అనిరు«ద్‌ మంచి సంగీతం అందిచారు. కీర్తీ సురేశ్‌ నటన హైలైట్‌. కార్తీక్, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటించారు’’ అన్నారు వంశీ, ప్రమోద్‌.

మరిన్ని వార్తలు