వెబ్‌ సిరీస్‌లో... 

8 Jul, 2020 00:07 IST|Sakshi

టాలీవుడ్‌.. కోలీవుడ్‌.. మాలీవుడ్‌.. శాండల్‌వుడ్‌.. బాలీవుడ్‌... ఇలా అన్ని భాషల్లోనూ ప్రస్తుతం డిజిటల్‌ హవా సాగుతోంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూత పడటంతో డిజిటల్‌ రంగానికి వీక్షకుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. దీంతో నిర్మాణ సంస్థలు ఈ రంగంవైపు మొగ్గుచూపుతున్నాయి. స్టార్‌ హీరోలు, హీరోయిన్లు సైతం నటించేందుకు పచ్చజెండా ఊపుతున్నారు. సౌత్‌లో టాప్‌ హీరోయిన్స్‌ అయిన సమంత, కాజల్‌ అగర్వాల్, తమన్నా వంటి వారు సైతం డిజిటల్‌ రంగంవైపు అడుగులేశారు. తాజాగా మరో స్టార్‌ హీరోయిన్‌ త్రిష కూడా డిజిటల్‌ ఎంట్రీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని కోలీవుడ్‌ టాక్‌. రామ్‌ సుబ్రమణ్యన్‌ దర్శకత్వం వహించనున్న ఓ తమిళ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు త్రిష అంగీకరించారట. తండ్రీ, కూతురు మధ్య జరిగే భావోద్వేగమైన కథతో ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కనుందని సమాచారం.

మరిన్ని వార్తలు