ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

14 Jan, 2018 18:42 IST|Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా సూలగిరి సమీపంలో ఆదివారం ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ప్రభుత్వ బస్సు, కారు ఢీ కొన్నాయి.  ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, పది మంది పరిస్థితి విషమంగాఉంది. మరో 27 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు