ఛత్తీస్‌గఢ్‌లో ఏడుగురు మావోల ఎన్‌కౌంటర్‌

19 Jul, 2018 12:36 IST|Sakshi

దంతెవాడ : ఛత్తీస్‌గఢ్‌ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. దంతెవాడ- బీజాపూర్‌ జిల్లా సరిహద్దులోని గంగుళూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో ఏడుగురు మావోయిస్టులు చనిపోగా మరికొందరు గాయాలతో తప్పించుకున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. సంఘటనా స్థలంలో భారీ సంఖ్యలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

దంతెవాడ అడవుల్లో మావోయిస్టులు తిరుగుతున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య భీకర్‌ కాల్పులు జరిగాయి. ఇందులో మొత్తం ఏడుగురు మావోయిస్టులు మరణించగా మరికొందరు గాయాలతో తప్పించుకున్నారు. వారికోసం స్పెషల్‌ టీమ్‌ తిమేనార్‌ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు.

మరిన్ని వార్తలు