విమానయానం మరింత భారం

1 Mar, 2016 03:42 IST|Sakshi

విమానాల్లో వినియోగించే ఇంధనం ‘ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)’పై ఆరు శాతం ఎక్సైజ్ డ్యూటీ పెంపును జైట్లీ ప్రతిపాదించారు. అంటే ప్రస్తుతం 8 శాతంగా ఉన్న ఈ పన్ను 14 శాతానికి పెరగనుంది. విమానయాన సంస్థల వ్యయంలో 40 శాతం కేవలం ఏటీఎఫ్ కోసమే ఖర్చవుతుంది.

ఈ లెక్కన ఏటీఎఫ్‌పై పన్ను పెంపుతో వినియోగదారులపైనే భారం పడుతుంది. అయితే ‘ప్రాంతీయ అనుసంధాన పథకం’లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని విమానయాన సంస్థలకు మాత్రం ప్రస్తుత పెంపు నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. ఏటీఎఫ్‌పై పన్ను పెంపుతో ఈ రంగంలో ముడి పదార్థాల ధరలు నాలుగైదు శాతం వరకు పెరగవచ్చని అంచనా.

మరిన్ని వార్తలు