ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష భేటీ

19 Jun, 2020 17:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని విపక్ష నేతలతో సమావేశమయ్యారు. ప్రధానితో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌ షాలు సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీకి 20 పార్టీలకు చెందిన నేతలకు ఆహ్వానం అందింది. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు శరద్‌ పవార్‌, సోనియా గాంధీ, ఉద్ధవ్‌ ఠాక్రే, మమతా బెనర్జీ, సీతారాం ఏచూరి సహా పలువురు నేతలు సమావేశంలో పాల్గొన్నారు. గాల్వన్‌ లోయలో జరిగిన పరిస్ధితులపై రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరణ ఇవ్వగా, ఉద్రిక్తతల నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై అఖిలపక్ష భేటీలో చర్చించారు. సమావేశం ప్రారంభం కాగానే అమర జవాన్ల మరణానికి సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

అఖిలపక్ష భేటీలో ఏపీ సీఎం
ప్రధానితో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. సీఎం జగన్‌తో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చదవండి : వ్యాపారం గాడిలో పడింది

మరిన్ని వార్తలు