చికెన్‌, పోర్క్‌ వద్దు.. ఎలుక మాంసమే ముద్దు!

26 Dec, 2018 15:41 IST|Sakshi

గువాహటి : పంట పొలాలను నాశనం చేస్తూ నష్టం కలిగిస్తున్న ఎలుకలతో అసోంలోని కుమరికటా గ్రామ రైతులు, కూలీలు సరికొత్త వ్యాపారం మొదలుపెట్టారు. పంటను రక్షించుకునే క్రమంలో వెంటాడిన ఎలుకలను అమ్మడం ద్వారా ఆదాయం పొందుతున్నారు. దీంతో ఆదివారం వచ్చిందంటే చాలు అక్కడి మార్కెట్‌ ఎలుక మాంసం కొనేవారితో కిటకిటలాడుతోంది. కోడి‌, పంది మాంసం కన్నా రోస్ట్‌ చేసిన, అప్పుడే పట్టిన  ఎలుకలకు మంచి గిరాకీ ఉంటోందని విక్రయదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలుక మాంసానికి డిమాండ్‌ బాగా పెరిగిందని.. కిలో 200 రూపాయలు వెచ్చించి మరీ కొనుగోలు చేయడంతో ధాన్యం అమ్మితే వచ్చే సొమ్ము కంటే కూడా ఎలుకల ద్వారానే మంచి ఆదాయం లభిస్తోందని సాంబా సోరెన్‌ అనే రైతు తెలిపాడు.

మరిన్ని వార్తలు