మాయావతిపై మండిపడ్డ బీజేపి

15 Jul, 2013 16:42 IST|Sakshi

హిందూ సంస్థలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), విశ్వహిందు పరిషత్తు (వీహెచ్పీ) నిషేధించాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకురాలు  మాయవతి డిమాండ్పై భారతీయ జనతాపార్టీ మండిపడింది.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్పాయ్ ఆమె డిమాండ్పై సోమవారం లక్నోలో తీవ్రంగా స్పందించారు.

 

ఉత్తరప్రదేశ్లో మాయవతి ప్రాభవం నానాటి తీసికట్టుగా తయారైందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో మైనారిటీ ముస్లిం ఓట్లను ఆకట్టుకునే  చర్యలో భాగంగానే ఆమె ఆ డిమాండ్లు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్, సమాజవాది పార్టీలు బీఎస్పీ బాటలోనే పయనిస్తున్నాయని లక్ష్మీకాంత్ బాజ్పాయ్ ఆరోపించారు. అయితే బీజేపీ, దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ మద్దతుతో గతంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన సంగతి మాయావతి గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.

 

ప్రజల సంక్షేమం కోసం కాకుండా మైనారిటీ ఓట్లను కొల్లగోట్టేందుకు  మాయావతి ఇటువంటి వ్యాఖ్యాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని వీహెచ్పీ ప్రతినిధి శరద్ శర్మ పేర్కొన్నారు.సర్వ సమాజ్ సద్భావన పేరిట మాయ కుల ర్యాలీలు నిర్వహిస్తుందని ఆయన ఆరోపించారు. కాగా తమ పార్టీ నిర్వహించిన కుల ర్యాలీలను  మాయావతి ఆదివారం గట్టిగా సమర్థించుకున్న విషయం తెలిసిందే. కోర్టులు కుల ర్యాలీలను నిషేధించడానికి బదులు విశ్వ హిందూపరిషత్, బజరంగ్‌దళ్, రాష్ట్రీయ స్వయం సేవక్ లాంటి సంస్థలను నిషేధించాలని ఆమె నిన్న ఇక్కడ డిమాండ్ చేసారు.

మరిన్ని వార్తలు