మనీష్‌ సిసోడియా ఓఎస్డీ అరెస్ట్‌

7 Feb, 2020 09:47 IST|Sakshi

న్యూఢిల్లీ: మరి కొన్ని గంటల వ్యవధిలో దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆఫిసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్డీ) అధికారి గోపాల్‌ కృష్ణ మాధవ్‌ అరెస్ట్‌ అయ్యారు. ఆయనను గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు అరెస్ట్‌ చేశారు. జీఎస్టీకి సంబంధించిన వ్యవహారంలో రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. అనంతరం మాధవ్‌ను అధికారులు సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు.

ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఎటువంటి సంబంధం లేనట్టుగా తెలుస్తోంది. ఈ కేసుపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అండమాన్‌ నికోబార్‌ దీవుల కేడర్‌ సివిల్‌ సర్వీసెస్‌ అఫిసర్‌ గోపాల్‌ కృష్ణ.. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వద్ద 2015లో  ఓఎస్డీగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓఎస్డీ అరెస్ట్‌ కావడం ఢిల్లీ రాజకీయాల్లో చర్చనీయ అంశంగా మారింది.

మరిన్ని వార్తలు