‘చూడండి.. మనిషి ఎలా రూపాంతరం చెందాడో’

17 Oct, 2019 18:54 IST|Sakshi

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన కుటుంబానికి సంబంధించిన మధురమైన ఫొటోలను, సరదా సన్నివేశాలను, భావోద్వేగాలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంటూ సామాజిక మాద్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారన్న విషయం అందరికి తెలిసిన విషయమే. అలాగే నెటిజిన్లకు ఉపయోగపడే సమాచారంతో పాటు చమత్కారమైన వీడియోలను, ఫొటోలను కూడా షేర్‌ చేస్తూ ఉండే స్మృతికి 6.8 లక్షల ఇన్‌స్టా ఫాలోవర్స్‌ ఉన్నారు.

తాజాగా స్మృతి అమెరికన్‌ ఐజీటీవీ న్యూస్‌ వెబ్‌సైట్‌కు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో  షేర్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ఈ వీడియోలో ‘పరిణామ క్రమంలో మనిషి భూమిపై ఉండే జీవరాశులుగా ఎలా రూపాంతరం చెందాడు,  అలాగే మన శరీర భాగాలు ఎక్కుఎ కాలం పని చేయొచ్చు, చేయకపోవచ్చు కానీ చరిత్రలో అదృశ్యమయ్యేంత ఖరీదైనవి అని చెప్పడానికి చిహ్నాంగా ఈ వీడియో అని చెప్పవచ్చు’ అని స్మృతి పేర్కొన్నారు. ఈ శరీర భాగాలు, చేతుల్లోని వెస్టిజియల్‌ పాల్మారిస్‌ లాంగస్‌ కండరాలు వాటి పనితీరును పరిణామ క్రమంలో భాగంగానే ప్రదర్శిస్తాయని ఈ వోక్స్‌ వీడియో అర్ధమని అన్నారు.

‘చూడండి.. శరీర భాగాలు రూపాంతరం చెందాయని చెప్పడానికి ఇదే రుజువు’ అంటూ పోస్ట్‌ చేసిన నాలుగు నిమిషాల నిడివి గల ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్‌ రాగా, లక్షల్లో లైక్‌లు వచ్చాయి. ఇప్పటికీ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే ‘మంచి విషయం చెప్పారు మేడమ్‌, ఈ వీడియో షేర్‌ చేసినందుకు అభినందనలు’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. గతంలో స్మృతి... రాజస్తాన్‌ న్యాయవాది, మోడల్‌కు సంబంధించిన హర్ట్‌ వార్మింగ్‌  స్టోరీ ఐజీటీవీలో రావడంతో దానిని కూడా షేర్‌ చేయడంతో  వైరల్‌గా మారింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా