-

కరోనా:  అన్ని రైళ్లూ బంద్

26 Mar, 2020 09:34 IST|Sakshi

లాక్ డౌన్ : ఏప్రిల్‌ 14 వరకు అన్ని  రైళ్లూ నిలిపివేత

సాక్షి, న్యూఢిల్లీ:  మహమ్మారి కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో  రైలు సర్వీసులన్నిటిని దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 14 వరకు నిలిపివేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.  కరోనా విస్తరణను నిరోధించే క్రమంలో తొలుత మార్చి 31 వరకు ఉన్న రైలు సర్వీసుల నిలిపివేతను తాజాగా ఏప్రిల్ 14 వరకు పొడిగించింది.  గూడ్సు రైళ్లు మినహా  అన్ని రైళ్లను రద్దు చేసింది. లాక్ డౌన్ నుంచి మినహాయింపు లభించిన నిత్యావసర వస్తువులకు కొరత రాకుండా గూడ్సు రైళ్లను యథాతథంగా నడపనుంది. అలాగే స్థానిక రైలు సర్వీసులు కూడా ఏప్రిల్ 14 వరకు నిలిపివేశారు. లోకల్ రైళ్లను నిలిపి వేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ మేరకు  రైల్వే మండళ్లకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. (రానున్న మూడు వారాలే అత్యంత కీలకం)

కోవిడ్ -19 నేపథ్యంలో తీసుకున్న చర్యల కొనసాగింపుగా, భారతీయ రైల్వేలలోని అన్ని ప్యాసింజర్ రైళ్లను  రద్దు చేయాలని నిర్ణయించాం. ప్రీమియం, ప్యాసింజర్ రైళ్లు, సబర్బన్ రైళ్లు ,  మెట్రో రైల్వే రైళ్లతో సహా మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఏప్రిల్ 14 అర్థరాత్రి 12 గంటల వరకు పొడిగించాలని ఆదేశించింది. అయితే  సరుకు రవాణా కార్యకలాపాలు కొనసాగుతాయి’ అని పేర్కొంది. (అందరూ త్యాగాలు చేయాల్సిందే!)

మరిన్ని వార్తలు