దండి యాత్ర ప్రారంభమైంది నేడే

12 Mar, 2018 15:47 IST|Sakshi

అహ్మదాబాద్‌: సరిగ్గా 88 ఏళ్ల క్రితం, ఇదే రోజు అంటే, 1930, మార్చి 12వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి 390 కిలోమీటర్ల దూరంలోని దండికి యాత్రను ప్రారంభించారు. భారత్‌లో విస్తారింగా దొరికే ఉప్పుపై కూడా బ్రిటిష్‌ పాలకులు పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ ఈ దండియాత్రను ప్రారంభించారు.

కేవలం 70 మంది అనుచరులతో గాంధీజీ ఈ యాత్రను ప్రారంభించగా, మార్గమధ్యంలో వేలాది మంది ప్రజలు యాత్రలో కలుస్తూ వచ్చారు. ఏప్రిల్‌ ఐదవ తేదీ నాడు దండికి గాంధీజీ యాత్ర చేరుకునే సరికి ఆయన వెనకాల మూడు కిలోమీటర్ల దూరం వరకు ప్రజలు యాత్రలో ఉన్నారు. గాంధీజీ 24 రోజులపాటు దండియాత్రను నిర్వహించాక పన్నును ఎత్తేసే వరకు సత్యాగ్రహాన్ని కొనసాగించారు.

మరిన్ని వార్తలు