మాజీ మంత్రి తోమర్ కు బెయిల్ నిరాకరణ

11 Jun, 2015 12:01 IST|Sakshi
ఆప్ మాజీ మంత్రి తోమర్ కు బెయిల్ నిరాకరణ

న్యూఢిల్లీ:  నకిలీ డిగ్రీ కలిగి ఉన్నారనే ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ కి నిరాశే మిగిలింది. తోమర్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ  కోర్టు గురువారం తిరస్కరించింది.  తన అరెస్టు  అక్రమమని ఆరోపిస్తూ, బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ ను రద్దు చేసిన కోర్టు, తదుపరి విచారణను జూన్ 16 కి  వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  
 
కాగా తనను అరెస్టు చేయడాన్ని తప్పుబడుతూ ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తనను అరెస్టు చేయడంపై ఆయన సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. అయితే, దానిని బుధవారం పరిశీలించేందుకు నిరాకరించిన సెషన్స్ జడ్జి ఇవాళ్టకు వాయిదా వేశారు.  తప్పుడు సర్టిఫికెట్లతో నకిలీ డిగ్రీ కలిగి ఉన్నారని పోలీసులు తోమర్ ను మంగళవారం అదుపులోకి తీసుకోగా,  మేజిస్ట్రేట్ కోర్టు నాలుగురోజుల కస్టడీ కూడా విధించిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు