వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించిన ఢిల్లీ ప్ర‌భుత్వం

7 May, 2020 09:27 IST|Sakshi

ఢిల్లీ : సాధార‌ణంగా అయితే విద్యార్థుల‌కు వేస‌విలో సెల‌వులుంటాయి. కానీ ఈసారి మాత్రం కొంచెం భిన్నం. సెల‌వుల్లోనే వేస‌వి వ‌చ్చింది. ఈ ఏడాది విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి ఢిల్లీ ప్ర‌భుత్వం   వేస‌వి సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది.  ప్ర‌తి ఏడాది మాదిరిగానే  మే 11 నుంచి జూన్ 30 వ‌ర‌కు స‌మ్మ‌ర్ హాలీడేస్ ఉంటాయ‌ని విద్యాశాఖ స్ప‌ష్టం చేసింది.  దీనికి సంబంధించి ఆయా పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు వాట్సాప్ లేదా ఇత‌ర మాధ్య‌మాల ద్వారా స‌మాచారం అందివ్వాల‌ని సూచించింది. ( జేఈఈ, నీట్ ప‌రీక్షా తేదీలు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం )

క‌రోనా కార‌ణంగా దేశ వ్యాప్తంగా మార్చి 23 నుంచి  స్కూల్స్ మూత‌ప‌డ‌టంతో విద్యార్థులు న‌ష్ట‌పోకుండా అన్ని యాజ‌మాన్యాలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. సాధారణంగా వేస‌విలో వివిధ కోచింగ్ సెంట‌ర్లు న‌డిచేవి. కానీ ఈసారి ప‌రిస్థితి మారింది. కాబ‌ట్టి విద్యార్థులు ఎవ‌రినీ క్లాసుల పేరిట కోచింగ్‌లు, ట్యూష‌న్లు అని పంప‌వ‌ద్ద‌ని ఆదేశించారు. అయితే ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని పేర్కొంది. దేశ రాజ‌ధానిలో క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 5100 కోవిడ్ కేసులు న‌మోద‌వ‌గా, 64 మంది మ‌ర‌ణించారు. 

మరిన్ని వార్తలు