మెట్రో రేట్లు పెరిగాయి!

8 May, 2017 18:51 IST|Sakshi
మెట్రో రేట్లు పెరిగాయి!

కాలుష్యం లేకుండా, తక్కువ సమయంలో ప్రయాణం చేసేందుకు అనువైన మార్గం అంటూ ఊదరగొట్టిన ఢిల్లీ మెట్రో.. ఇప్పుడు తన చార్జీలతో ప్రయాణికులను బెదరగొడుతోంది. తాజాగా మరోసారి మెట్రోరైలు టికెట్ల ధరలు పెరిగాయి. ఇప్పటివరకు కనీసచార్జీ రూ. 8గా ఉండగా.. ఇప్పుడది రూ. 10కి చేరుకుంది. గరిష్ట చార్జీ రూ. 50 వరకు వెళ్లబోతోంది. అంతేకాదు.. ఇప్పుడు పెట్టిన వాతకు తోడు అక్టోబర్‌లో మరోసారి రేట్లు పెరుగుతాయని కూడా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ చెబుతోంది. అప్పుడు గరిష్ట చార్జీ రూ. 60 కానుంది. అక్టోబర్‌లో పెంచబోయే ధరలకు కూడా డీఎంఆర్‌సీ బోర్డు ఇప్పుడే ఆమోదం చెప్పేసింది.

ఆఫ్ పీక్‌, సెలవుల్లో డిస్కౌంట్లు
అయితే ఇప్పుడు ధరలు పెంచడమే కాక, ఆదివారాలతో పాటు రిపబ్లిక్ డే లాంటి పబ్లిక్ హాలిడేలలో మెట్రో రైళ్లలో ప్రయాణాలు చేసేవారికి డిస్కౌంట్లను కూడా ప్రకటించారు. స్మార్ట్ కార్డ్ యూజర్లకు ఇప్పటికే రిబేట్ వస్తుండగా, అదికాక ఇంకా 10 శాతం తగ్గిస్తారు. ఉదయం 8 గంటలలోపు, మధ్యాహ్నం 12 నుంచి 5 వరకు, అలాగే రాత్రి 9 నుంచి మూసేసేవరకు ఉండే సమయాన్ని ఆఫ్-పీక్ అంటారు.

పెరిగిన ధరలు ఇలా..
2 కిలోమీటర్ల వరకు - రూ. 10
2-5 కిలోమీటర్ల వరకు - రూ. 15
5-12 కిలోమీటర్ల వరకు - రూ. 20
12-21 కిలోమీటర్ల వరకు - రూ. 30
21-32 కిలోమీటర్ల వరకు - రూ. 40
32 కి.మీ. కంటే ఎక్కువ దూరం - రూ. 50

మరిన్ని వార్తలు