కల్లెక్టరెట్‌లో మహిళ రైతు కలకలం | Sakshi
Sakshi News home page

కల్లెక్టరెట్‌లో మహిళ రైతు కలకలం

Published Mon, May 8 2017 6:57 PM

కల్లెక్టరెట్‌లో మహిళ రైతు కలకలం - Sakshi

అనంతపురం అర్భన్‌:  సమస్యను పరిష్కారించాలని ఒక మహిళ అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయింది. ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. తన భూవివాదం పరిష్కారం కాలేదని ఆ మహిళ రైతు అనంతపురం కలెక్టరెట్‌లో ఆత్మహత్యకు యత్నించటం కలకలం రేపింది. కైరేపు గ్రామానికి చెందిన జయమ్మకు భూ పంపిణి కింద 339/6 సర్వే నంబరులో 2.90 ఎకరాల భూమికి 2005లోనే అధికారులు పట్టా ఇచ్చారు. భర్త చనిపోయిన తరువాత ఈ భూమికి జయమ్మ పేరు మీద పాసు పుస్తకం ఇచ్చారు.

తన భూమిని మరిది, ఆయన కుమారులు కలిసి  ఆక్రమించుకున్నారు. ఈ విషయాన్ని ఆ మహిళ తహశీల్దార్‌, ఎస్‌ఐకి పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదు. అదికారుల చూసి చూడనట్టుగా వ్యవహరించారు. దీంతో ఆమె విసుగు చెంది కల్లెక్టరెట్‌లో సోమవారం పెట్రోల్‌ పోసుకుని   నిప్పంటించుకోవడానికి యత్నించింది. చుట్టు పక్కల వారు, సిబ్బంది అందరూ కలిసి  ఆ మహిళ రైతును అడ్డుకున్నారు.  పోలీసులు, సిబ్బంది కలిసి జయమ్మను ఇన్‌చార్జి కలెక్టర్‌ టి.కె.రమామణి వద్దకు తీసుకెళ్లి అర్జీ ఇప్పించారు. సమస్య తెలుసుకున్న ఇన్‌చార్జి కల్లెక్టర్‌ ఆమె సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

Advertisement
Advertisement