ఫీజు కోసం ఆస్పత్రి నిర్వాకం

7 Jun, 2020 12:51 IST|Sakshi

ఆస్పత్రి ధనదాహం

భోపాల్‌ : చికిత్స ఫీజు చెల్లించలేదని ఓ వృద్ధుడిని ఆస్పత్రి బెడ్‌పై తాళ్లతో కట్టేసిన ఉదంతం మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. షజాపూర్‌కు చెందిన ఓ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైద్య ఖర్చులు రూ 11,000 చెల్లించనందుకు బాధితుడి కాళ్లు, చేతులను ఆస్పత్రి బెడ్‌కు కట్టేశారని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపడంతో ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పందిస్తూ సదరు ఆస్పత్రిపై కఠిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఆస్పత్రిలో చేరేముందు రూ 5000 డిపాజిట్‌గా చెల్లించామని, మరికొన్ని రోజులు చికిత్స కొనసాగడంతో బిల్లు చెల్లించేందుకు తమ వద్ద డబ్బు లేదని బాధితుడి కుమార్తె చెప్పారు. కాగా, రోగి మూర్ఛ వ్యాధితో బాదపడుతుండటంతో తనకు తాను హాని తలపెట్టుకోకుండా మంచానికి కట్టివేశామని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. మానవతా దృక్పథంతో వారి బిల్లును ఆస్పత్రి మాఫీ చేసిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై షజాపూర్‌ జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది.

చదవండి : కరోనా చికిత్సకు అటువైపు వెళ్లబోము!!

మరిన్ని వార్తలు