నేడు జైట్లీకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌

7 Apr, 2018 03:09 IST|Sakshi

న్యూఢిల్లీ: కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ(65) శుక్రవారం ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో చేరారు. నేడు ఆయనకు శస్త్రచికిత్స చేస్తారని, అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జైట్లీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అపోలో ఆసుపత్రి వైద్యుడు డాక్టర్‌ సందీప్‌ గులేరియా జైట్లీకి శస్త్రచికిత్స చేస్తారని సమాచారం. అనారోగ్యం కారణంగా గత కొద్ది రోజులుగా జైట్లీ ఇంటికే పరిమితమయ్యారు. ఈనెల 12న జరిగే 10వ ‘బ్రిటన్‌–ఇండియా ఆర్థిక, వాణిజ్య చర్చ’ల్లో పాల్గొనేందుకు లండన్‌ వెళ్లాల్సి ఉండగా.. ఆ పర్యటనను రద్దుచేసుకున్నారు. ‘కిడ్నీ సమస్యలు, కొన్ని ఇన్‌ఫెక్షన్లకు చికిత్స పొందుతున్నాను’ అని జైట్లీ గురువారం ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు