అన్నదాతలకు తీపి కబురు

11 Apr, 2016 18:07 IST|Sakshi

న్యూఢిల్లీ:  నైరుతి రుతుపవనాలకు  ప్రస్తుతం పరిస్థితి సానుకూలంగా ఉందని, ఈ ఏడాది మంచి వానలు కురుస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.  రెండు సంవత్సరాల తరువాత, ఈ ఏడాది మంచి వానలు కురిసే అవకాశం ఉందంటూ కేంద్ర  ప్రభుత్వం   రైతన్నలకు  తీపి కబురందించింది. నైరుతి రుతుపవనాల కారణంగా రెండేళ్ల వర్షాభావ పరిస్థితి నుంచి ఈ ఏడాది బయటపడే అవకాశం ఉందని  ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో ఈ జూన్ ప్రారంభంలో  ఖరీఫ్ సీజన్లో పంట విస్తీర్ణం,  ఉత్పత్తి పెంచడానికి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని  వ్యవసాయ శాఖ కార్యదర్శి శోభన కె పట్నాయక్  రాష్ట్రాలకు సూచించారు.  2016-17  ఖరీఫ్ ఉద్యమంలో భాగంగా జరిగిన జాతీయ సదస్సులో పట్నాయక్  ప్రసంగించారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ   ఆధ్వర్యంలో వ్యవసాయంపై  ఏప్రిల్ 11 మరియు 12 న్యూఢిల్లీలో   ఖరీఫ్ క్యాంపెయిన్  2016  పేరుతో  జాతీయ సదస్సు జరగనుంది.

వర్షా భావ పరిస్థితుల కారణంగా గత రెండేళ్లకాలంగా దేశంలోని  ఆహారధాన్యాల ఉత్పత్తి క్షీణిస్తూ వచ్చింది.  2014-15 పంట సంవత్సరం (జూలై-జూన్) ఆహార ధాన్యాల ఉత్పత్తి  252.02 మిలియన్ టన్నులు కాగా,  మునుపటి సంవత్సరంలో రికార్డు 265.04 మిలియన్ టన్నుల నుంచి క్షీణించింది. 2015-16 పంట సంవత్సరానికి ఇది 253.16 మిలియన టన్నులకు కొద్దిగా పెరుగుతుందని అంచనా.  వరుసగా రెండు సం.రాలుగా  చెడు వర్షాకాలం దేశంలో రైతుల దుస్థితి నీటి కొరత దారితీసాయనీ,   రైతులు,పంట వనరులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయని  పట్నాయక్ పేర్కొన్నారు. 


అటు గత రెండు సంవత్సరాల నాటి వర్షాభావ పరిస్థితులు, ఈ ఏడాది  పునరావృతం అవకాశం  లేదని గత  ఫిబ్రవరి ఆర్థిక సర్వే తేల్చి చెప్పిందన్నారు.  ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉండాలని పట్నాయక్  రాష్ట్రాలకు  సూచించారు.  ఎలాంటి అవాంఛనీయ  సమస్యనైనా పరిష్కరించేందుకు వీలుగా ఆకస్మిక ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. మరోవైపు రుతుపవనాల ఆగమనంపై వాతావరణ శాఖ  అంచనాలు ఈ నెలాఖరుకు రానున్నాయి.
 

మరిన్ని వార్తలు