'ఆ కండోమ్లు వద్దే వద్దు..'

16 Jul, 2016 14:01 IST|Sakshi
'ఆ కండోమ్లు వద్దే వద్దు..'

డెహ్రాడూన్: తమ సంస్థ పేరును ఉపయోగిస్తూ కండోమ్స్ పంపిణీ చేయడంపట్ల ఉత్తరాఖండ్ ఆశా (అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అవమానిస్తున్నారని ఆందోళన తలపెట్టారు. అంతకుముందు ఈ కండోమ్స్ ను డీలక్స్ నిరోద్ గా పిలవగా వాటిని ఆశా నిరోద్ గా పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేస్తోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆశా వర్కర్లు..  ఆశా పేరిట నిరోద్ లు పంపిణీ చేయడం ఆశా వర్కర్లను, అందులో పనిచేసే మహిళలను అవమానించడమే అన్నారు.

ఇప్పటికే ఇవి వేల సంఖ్యలో అన్ని ఆరోగ్యం కేంద్రాలకు వెళ్లాయని చెప్పారు. ఏమాత్రం అలసట తీసుకోకుండా నిరంతరం నిజాయితీగా పనిచేసే ఆశా వర్కర్లకు ఈ చర్య ఇబ్బంది కలిగించే విషయమే అని రాష్ట్ర ఆశా వర్కర్ల అధ్యక్షురాలు శివ దూబే అన్నారు. ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉపకారం చేయాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నా చేతకాదుగానీ.. తాజాగా ఈ చర్య చేపట్టి మరింత ఆజ్యం పోసిందని ఆందోళన వేగం పెంచారు. దీంతో వెంటనే ఈ నిరోద్ ల పంపిణీ నిలిపివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
 

మరిన్ని వార్తలు