ఇంద్రాణిని కొట్టారు, దూషించారు!

28 Jun, 2017 02:29 IST|Sakshi
ఇంద్రాణిని కొట్టారు, దూషించారు!

సీబీఐ కోర్టులో ఆమె తరఫు న్యాయవాది ఫిర్యాదు  
ముంబై: షీనాబోరా హత్యకేసులో నిందితు రాలు ఇంద్రాణి ముఖర్జీని బైకల్లా జైలు సిబ్బంది కొట్టారని, దూషించారని ఆమె తరఫు న్యాయవాది గుంజన్‌ మంగ్లా సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆందోళన చేస్తే లైంగికదాడి చేస్తానంటూ జైలు సిబ్బంది, సూపరింటెండెంట్‌ బెదిరించారన్నారు. ఇంద్రాణి కాళ్లు, చేతులు, ముఖంపై గాయాలను తనకు చూపించారని, జైలు సిబ్బందిపై ఫిర్యాదు చేయాలని ఆమె కోరిందన్నారు. విచారణ జరిపిన కోర్టు బుధవారం ఇంద్రాణిని హాజరుపరచాలని ఆదేశించింది.

బైకల్లా జైలు ఖైదీ మంజురా (45) ముంబైలోని జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. జైలు సిబ్బంది తీవ్రంగా కొట్టడంతోనే మంజురా మృతిచెందిందని ఆరోపిస్తూ ఇంద్రాణి సహా ఖైదీలు ఆందోళన చేపట్టారు. జైలు డాబాపైకెక్కి వార్తా పత్రికలకు నిప్పు అంటిస్తూ జైలు సిబ్బందికి వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు మంజురాను జైలు సిబ్బంది తీవ్రంగా హింసించారని, జననాంగంలోకి లాఠీ జొప్పించారని పోలీసులు చెప్పారు. ఆందోళన విషయమై జైలు అధికారి ఒకరు స్పందిస్తూ.. ఆహారం తీసుకోవద్దని, ఆందోళనను ఆపడానికి ప్రయత్నిస్తే పిల్లలను అడ్డుగా ఉంచుకోవాలని ఖైదీలను ఇంద్రాణి ఉసిగొల్పారని ఆరోపించారు.
 

>
మరిన్ని వార్తలు