కమలా బేనివాల్కు ఉద్వాసన

7 Aug, 2014 11:24 IST|Sakshi

న్యూఢిల్లీ : మరో గవర్నర్పై వేటు పడింది. మిజోరం గవర్నర్ కమలా బేనివాల్కు ఉద్వాసన పలికారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఆ రాష్ట్ర గవర్నర్గా వ్యవహరించారు. మోడీ సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు,  కమలా బేనివాల్ కు మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. కమలా బేనివాల్ పదవీకాలం కేవలం నాలుగు నెలలే ఉన్నా, ఆమెను నెలరోజుల క్రితం మిజొరాం గవర్నర్గా బదిలీ చేశారు.

కమలా బేనివాల్ పదవీకాలం మరో రెండు నెలల్లో ముగియనున్న దశలో గవర్నర్ పదవి నుంచి తప్పుకోవాలని రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడటం విశేషం. పదవీకాలం చివరకు వచ్చేసినా బేనివాల్ తొలగింపు రాజకీయ ప్రాథాన్యత సంతరించుకుంది. కాగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక కారణాలు ఏవైనా ఇప్పటికి వరుసపెట్టి ఆరుగురు గవర్నర్లు రాజీనామా చేశారు.

 

మరికొందరు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. వీళ్లంతా యూపీఏ హయాంలో నియమితులైనవాళ్లే.కాగా గుజరాత్ గవర్నర్ గా ఉన్న సమయంలో కమలా బేనివాల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో పదవి నుంచి తొలగించినట్లు సమాచారం.

 

మరిన్ని వార్తలు