మహిళా భద్రతకు శక్తివంతమైన సాధనం!

18 May, 2016 14:56 IST|Sakshi
మహిళా భద్రతకు శక్తివంతమైన సాధనం!

న్యూఢిల్లీః మహిళల భద్రతకు భరోసాను కల్పిస్తూ కార్పన్ మొబైల్ మరో అడుగు ముందుకేసింది. పూర్తి భద్రతా సామర్థ్యం కలిగిన పరికరాన్నిఅందించేందుకు సిద్ధమైనట్లు ప్రముఖ దేశీయ మొబైల్ సంస్థ కార్బన్ ప్రకటించింది. మరో రెండు నెలల్లో మహిళల కోసం ప్రత్యేకంగా పనిచేసే మొబైల్ ఎస్ ఓఎస్ అనువర్తనాన్ని అందించనున్నట్లు వెల్లడించింది.   

వినియోగదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నపుడు, వారి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లకు అత్యవసర సందేశాలను పంపించేందుకు వీలుగా ఈ కొత్త సేఫ్టీ యాప్ పనిచేస్తుంది. మొబైల్ స్క్రీన్ పై ఒక్కసారి టాప్ చేస్తే చాలు.. కుటుంబ సభ్యులు, ఇతర అత్యవసర కాంటాక్ట్ నెంబర్లకు సమాచారం నిమిషాల్లో అందిపోతుంది. కాంటాక్ట్ నెంబర్ తో పాటుగా వారి లొకేషన్ ను కూడ ముందుగా షేర్ చేస్తే... అత్యవసర పరిస్థితుల్లో వారున్న ప్రదేశాన్ని సైతం గుర్తించేట్టుగా కార్బన్ మొబైల్ కొత్త ఫీచర్ ను అందిస్తోంది.

తాజా సదుపాయంతో వినియోగదారులు అలర్ట్స్ మాత్రమే కాక అలారం మోగించే అవకాశాన్ని కూడ కల్పిస్తోంది. మొబైల్ స్క్నీన్ లాక్ ను అన్ లాక్ చేయకుండా మొబైల్ ను  షేక్ చేస్తూ, పవర్ బటన్ ను నొక్కుతుంటే చాలు... అలర్ట్స్ తో పాటు, అలారం కూడ అందే సదుపాయం కార్బన్ కొత్త ఫీచర్ ద్వారా పరిచయం చేస్తోంది. 2017 జనవరి 1 నుంచి మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా పానిక్ బటన్ ఇన్ స్టాల్ చేయాలన్న ప్రభుత్వ సూచనను కార్బన్ అమల్లోకి తెచ్చింది. దీనితోపాటు అన్నిఫోన్లలో జనవరి 2018 నాటికి తప్పనిసరిగా  ఇన్ బిల్ట్ జీపీఎస్ నేవిగేషన్ సిస్టమ్ ఉండాలని కూడ ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. ప్రభుత్వ సూచనలను హ్యండ్ సెట్ ఇండస్ట్రీ బాడీ ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ (ఐసీఏ) కూడ స్వాగతించింది.

మరిన్ని వార్తలు