‘మఫ్లర్‌ మ్యాన్‌’ సందడి ‘‍క్రేజీ’

16 Feb, 2020 20:33 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ‘బేబి మఫ్లర్‌ మ్యాన్‌’ సందడి చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల రోజు సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయిన ‘అవ్‌యాన్‌ తోమర్‌’కు కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఫంక్షన్‌కు ఆహ్మనం అందిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం రామ్‌లీలా మైదానంలో ముడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా  కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్‌ మాదిరిగా టోపీ, స్వెటర్‌, మఫ్లర్‌, కళ్లజోడుతో వచ్చిన ఈ బుడతడు అందరి దృష్టిని ఆకర్షించాడు. (‘బేబీ మఫ్లర్‌మ్యాన్‌’కు ఆప్‌ బంపర్‌ ఆఫర్‌!)

ఈవెంట్‌లో చిన్నారి సెంటర్‌ ఆఫ్‌ ఆట్రాక్షన్‌గా నిలవడంతో పిల్లవాడితో సెల్ఫీలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. ఈ చిన్నారిని తమ కెమెరాల్లో బంధించేందుకు మీడియా సైతం ఆసక్తి చూపింది. ఇక ఆప్‌ ఎమ్మెల్యేలు భగవత్‌మాన్‌, రాఘవ్‌ చద్దా, సోమ్‌నాథ్‌ భారతి వంటి వారు కూడా పిల్లాడితో ఫోటోలు దిగి ముద్దు చేశారు. అదే విధంగా మరికొంత మంది చిన్నారులు కూడా కేజ్రీవాల్‌ను అనుకరిస్తూ దుస్తులు ధరించి కార్యక్రమానికి వచ్చి ప్రత్యేకంగా నిలిచారు. (వైరల్‌ : పాటతో అదరగొట్టిన కేజ్రీవాల్‌)

చదవండి : ఒకటి కాదు, రెండు కాదు.. హ్యాట్రిక్‌ కొట్టారు!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు