భార్యతో గొడవ.. ఆత్మహత్యాయత్నం

17 Apr, 2020 14:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భార్యతో గొడవ అనంతరం ఓ వ్యక్తి  ఆత్మహత్యకు యత్నించిన ఘటన గురువారం రాత్రి జరిగింది. బ్రిడ్జ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా అతడిని పోలీసులు రక్షిం‍చిన ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. కాగా దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లోనే ఉంటున్న క్రమంలో సదరు వ్యక్తి భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం మనస్తాపం చెందిన ఆ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరిపారు. (లాక్‌డౌన్‌ వేళ తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు)

పోలీసుల సమాచారం మేరకు..  ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి పేరు హర్జీత్‌ సింగ్‌ . అతను వెస్ట్‌ ఎన్‌క్లేవ్‌ సమీపంలోని తిలక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతని భార్య ఇళ్లల్లో పని చేస్తూ ఉంటుంది. కాగా లాక్‌డౌన్‌లో కారణంగా ఇంట్లోనే ఉంటున్న సదరు వ్యక్తి, తన భార్యతో గొడవ పడ్డాడు. ఇక వారి మధ్య గొడవ పెరగడంతో ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో వెస్ట్‌ ఎన్‌క్లేవ్‌ సమీపంలోని బ్రిడ్జ్‌పై నుంచి దూకుతుండగా విధుల్లో ఉన్న పోలీసుల అతడిని గమనించారు. ఇక వెంటనే  ఘటన స్థలానికి చేరుకుని అతడిని రక్షిం‍చారు. కాగా ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నట్లు పోలీసుల తెలిపారు. (కోవిడ్‌–19పై ఆన్‌లైన్‌ టాలెంట్‌ కాంపిటీషన్‌)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు