చిత్రహింసల వల్లే నేతాజీ మరణం!

7 Jan, 2017 02:02 IST|Sakshi
చిత్రహింసల వల్లే నేతాజీ మరణం!

కోల్‌కతా: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమాన ప్రమాదంలో చనిపోలేదని, సోవియట్‌ యూనియన్ లో బ్రిటిష్‌ అధికారుల ఇంటరాగేషన్ లో చిత్రహింసల వల్ల మృతి చెందారని తాజా వాదన తెరపైకి వచ్చింది. రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ జీడీ బక్షీ రాసిన ‘బోస్‌– ది ఇండియన్ సమురాయ్‌’ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

జపాన్ నుంచి తప్పించుకుని సైబీరియాకు వెళ్లిన నేతాజీ అక్కడ ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వ ఎంబసీని ఏర్పాటు చేశారని , నేతాజీ  తప్పించుకున్న విషయం తెలుసుకున్న బ్రిటిష్‌ అధికారులు.. ఆయనను విచారణ కు అనుమతించాలంటూ సోవియట్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు